iDreamPost
android-app
ios-app

Pawan Kalyan: రెండు రోజుల్లోనే రెండు సార్లు విరామం.. ఇదేమి ప్రచారం పవన్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పిఠాపురంలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ అక్కడ ముగించుకుని గుంటూరు జిల్లా తెనాలి వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే ఒకసారి తన పర్యటనకు విరామం ప్రకటించిన పవన్, మరోసారి కూడా విరామం ప్రకటించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పిఠాపురంలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ అక్కడ ముగించుకుని గుంటూరు జిల్లా తెనాలి వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే ఒకసారి తన పర్యటనకు విరామం ప్రకటించిన పవన్, మరోసారి కూడా విరామం ప్రకటించారు.

Pawan Kalyan: రెండు రోజుల్లోనే రెండు సార్లు విరామం.. ఇదేమి ప్రచారం పవన్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే రాజకీయం చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. పవన్ చేస్తున్న పాలిటిక్స్ జనసేన శ్రేణులకు సైతం అర్థం కాక పిచ్చికెక్కిపోతున్నారు. మాటలను కోటలు దాటించే పవన్.. చేతలు మాత్రం చేయి దాటించడం లేదు. బహిరంగం స్పీచ్ లో ఆయన ఊగిపోతూ చేసే ప్రసంగానికి ఇక హద్దే ఉండదు. ఇది ఇలా ఉంటే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసే ఎన్నికల  ప్రచారం, ప్రజలల్లో తిరిగే విధానంపై తరచూ పవన్ కల్యాణ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా పిఠాపురం పర్యటనలో ఆయన చేస్తున్న ప్రచారం, తీసుకుంటున్న విరామాలపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు విరామం.. ఇదేమి ప్రచారం పవన్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు పిఠాపురంలో ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే  మధ్యలో జ్వరం బారిన పడి.. హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు.  తిరిగి పిఠాపురం వచ్చిన  పవన్ కల్యాణ్ పర్యాటన పూర్తి చేశారు. ఇక పిఠాపురం నుంచి తెనాలి వెళ్లాల్సి ఉండగా..మరోసారి అస్వస్థతకు గురయ్యారు. పవన్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారని జనసేన పార్టీ ట్విట్టర్ లో తెలిపింది.  జ్వరం ఎక్కువగా ఉన్నందున్న విశ్రాంతి అవసరమైన డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. బుధవారం సాయంత్ర తెనాలి ర్యాలీ, సభల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. అయితే ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పూర్తిగా జ్వరంగా తగ్గకపోవడంతో పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. మళ్లీ తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు.

ఇక పవన్ కల్యాణ్ అనారోగ్యం దృష్ట్యా విరామం తీసుకోవడం అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ  ఇదే సమయంలో మండే ఎండలను సైతం లెక్క చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనేక వ్యాఖ్యలు చేశారు పవన్. ఆయనకు రాజకీయం అంటే తెలియదని ముద్దులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ పవన్  ఎద్దేవా చేశారు. అంతేకాక తాను ఒక యుద్ధ వీరుడనని, తాను ఓ శక్తినంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. అయితే ఆయన చెప్పే మాటలకు.. ఇలా పర్యటనల సమయంలో ఇస్తున్న బ్రేక్ లతో సామాన్య ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవన్ సినిమాల్లో మాత్రమే హీరో అని.. పొలిటికల్ గా జీరోనే అనే టాక్ వినిపిస్తోంది.

కేవలం నాలుగు రోజుల  పర్యటనలోనే రెండు విరామలు ఇచ్చిన పవన్.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అసలు ప్రచారం చేయగలడా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో మమేకమవుతూ సాగడం అంటే.. స్టేజిపై ఊగిపోతూ ప్రసంగించినంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు విరామం తీసుకున్న పవన్ ఎక్కడ.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రజల్లోనే ఉన్న సీఎం జగన్ ఎక్కడ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ 2019 ఎన్నికలకు ముందు చేసిన ప్రజాసంకల్ప యాత్ర మాదిరిగా పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే సాహసం చేయలేరని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రెండు నియోజవర్గాల పర్యటనలోనే పవన్ ఇన్ని బ్రేక్స్ ఇస్తే..ఇక అన్ని నియోజవర్గాల్లో పర్యటిస్తే.. ఎన్ని విరామలు వస్తాయో అని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.