iDreamPost
android-app
ios-app

పొత్తులో చెత్త ప్లాన్.. చంద్రబాబు వ్యూహానికి జనసేన బలి!

Chandrababu, Janasena: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ పొత్తుకు అంగీకరిస్తే.. వ్యూహాత్మకంగా జనసేనను బలి చేసేలా చంద్రబాబు ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

Chandrababu, Janasena: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ పొత్తుకు అంగీకరిస్తే.. వ్యూహాత్మకంగా జనసేనను బలి చేసేలా చంద్రబాబు ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

పొత్తులో చెత్త ప్లాన్.. చంద్రబాబు వ్యూహానికి జనసేన బలి!

రాజకీయాల్లో ఎన్నో రకాల పార్టీలు ఉంటాయి. కొన్ని పార్టీలకు ఇతర పార్టీలతో అవసరం ఉంటుంది. అలానే కొన్ని పార్టీలు పరస్పర అవసరాల కోసం పొత్తులు పెట్టుకుంటాయి. ఈ క్రమంలో కొందరు నేతలు..తమతో పొత్తున పార్టీని నమ్మించి మోసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలోనే అనేకం జరిగాయి. అయితే తాజాగా ఏపీలో కూడా జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది. అది కూడా నారా  చంద్రబాబు వ్యూహానికి జనసేన బలి అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆడినట్లు ఏ నేత రాజకీయ క్రీడ ఆడలేడని చాలా మంది అంటుంటారు. నమ్మించి మోసం చేయడం, వెన్నుపోటు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యా అని వైసీపీ నేతల అంటుంటారు. ఆ మాటలను నిజం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్,జనసేన విషయంలో  చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేనాను పోటీ చేయించేలా చంద్రబాబు వ్యూహం రచించాడని ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలోనే చంద్రబాబు రాజకీయ క్రీడలో పవన​ కల్యాణ్‌ పావుగా మారారని పొలిటికల్ సర్కిల్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్‌ను బలి చేసేందుకు చంద్రబాబు మరో కొత్త ప్లాన్‌ రెడీ చేసినట్టు మరో టాక్ వినిపిస్తోంది. దీంతో, పవన్ తో పాటు జనసైనికులకు గట్టి షాక్‌ తగిలే అవకాశముందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

చంద్రబాబు ఢిల్లీ వేదికగా బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాన సంగతి తెలిసిందే. అయితే సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో పొత్తు ఉండాలంటే బీజేపీ తాము అడిగిన స్థానాలివ్వాలనే షరతు పెట్టినట్లు సమాచారం. దీంతో, బీజేపీ అడుగుతున్న స్థానాల విషయంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోందంట. ఈ క్రమంలో చంద్రబాబు.. మరో కొత్త ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాజకీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ కోరుకుంటున్న లోక్ సభ స్థానాలను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

టీడీపీ-జనసేన కూటమి పొత్తులో భాగంగా పవన్ పార్టీకి మూడు లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, జనసేనకు కేటాయించిన మూడు పార్లమెంట్ స్థానాల నుంచే సీట్లను కట్‌ చేసే విధంగా చంద్రబాబు  ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌ కల్యాణ్ ను చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా చంద్రబాబు రాజకీయ క్రీడలు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ నేతలు బలి కాబోతున్నారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది.