iDreamPost
android-app
ios-app

జనసేనకు మరో ఎదురు దెబ్బ.. కీలక నేత రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ మరింత వేడెక్కుతోంది. సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీలను రాజీనామా చేసి.. మరో పార్టీకి జై కొడుతున్నారు. ముఖ్యంగా జనసేన తమ్ముళ్లలో అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ మరింత వేడెక్కుతోంది. సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీలను రాజీనామా చేసి.. మరో పార్టీకి జై కొడుతున్నారు. ముఖ్యంగా జనసేన తమ్ముళ్లలో అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది.

జనసేనకు మరో ఎదురు దెబ్బ.. కీలక నేత రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రతిపక్ష కూటమికి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా జన సేన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు కొన్ని స్థానాలు కేటాయించడంపై గుర్రుగా ఉన్నారు. తొలి నుండి పార్టీని నమ్ముకుని, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆశపడి.. చివరకు టికెట్ దక్కకపోవడం అటు ఉంచి, మరో పార్టీకి సీటు కేటాయిచండంతో భంగపడ్డ జనసేన తమ్ముళ్లు పార్టీని వీడుతున్నారు. మొన్నటి మొన్న జనసేన కీలక నేత పోలిన మహేష్.. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం స్థానాన్ని ఆశించగా.. చివరకు ఆ సీటుకు కూటమిలో భాగంగా బీజెపీ నేత సుజనా చౌదరికి కేటాయించడంతో మనోవేదనకు గురై.. పార్టీని వీడి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసి వైఎస్సార్సీపీ గూటికి చేరిన సంగతి విదితమే.

అలాగే ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త బీవీ రావు కూడా పార్టీని వీడాడు. ఇప్పుడు మరో కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి.. పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే జనసేనను వీడుతున్నట్లు ప్రకటించాడు.ఆయన రాజీనామా లేఖలో ‘ వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానని అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీ అందరికి మరియు జనసేన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Another blow to Jana Sena

నా నిర్ణయం ఎవరికైనా ఏదైనా అసౌకర్యాన్ని కలిగిస్తే దయచేసి నా క్షమాపణలను అంగీకరించండి. ప్రతి ఒక్కరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను.’ అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. తన రాజీనామా లేఖను అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు. కాగా, ఇతడు కూడా టికెట్ ఆశించి భంగపడ్డాడు. నెల్లూరు జిల్లా సిటీ స్థానాన్ని ఆశించారు మనుక్రాంత్ రెడ్డి. కానీ ఆ పొత్తులో భాగంగా ఆ సీటును టీడీపీకి కేటాయించారు. దీంతో మను తీవ్ర అసంతృప్తికి గురై పార్టీని వీడారు. ఇదిలా ఉంటే.. టీడీపీ, బీజెపీ, జనసేన నేతృత్వంలోని కూటమి పవన్ కళ్యాణ్ పార్టీకి కేవలం 21 సీట్లు మాత్రమే కేటాయించింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న జనసేన తమ్ముళ్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మనుక్రాంత్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించారు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి.