iDreamPost
android-app
ios-app

Sivaji: జనసేన వల్ల TDP ఓటమి.. బిగ్‌బాస్‌ శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • Published Mar 06, 2024 | 2:15 PM Updated Updated Mar 06, 2024 | 2:15 PM

బిగ్‌బాస్‌ శివాజీ ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జనసేన వల్ల టీడీపీ ఓటమి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

బిగ్‌బాస్‌ శివాజీ ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జనసేన వల్ల టీడీపీ ఓటమి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

  • Published Mar 06, 2024 | 2:15 PMUpdated Mar 06, 2024 | 2:15 PM
Sivaji: జనసేన వల్ల TDP ఓటమి.. బిగ్‌బాస్‌ శివాజీ సంచలన వ్యాఖ్యలు

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి.. గరుడపురాణం అంటూ ఏదో చెప్పి.. ఉన్న కాస్త మంచి పేరును పొగొట్టుకున్నాడు. ఆయనకు కలిసి వచ్చిన సినిమాల్లోనే ప్రయత్నాలు చేసుకోక.. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి విమర్శల పాలయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌ అయిన శివాజీ.. మళ్లీ బుల్లితెర, వెండితెర మీద కనిపించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బిగ్‌బాస్‌ ద్వారా.. తిరిగి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇదే సమయంలో ఆయన నటించిన 90స్‌ వెబ్‌ సిరీస్‌ కూడా మంచి ఆదరణ ద​క్కించుకుంది. దాంతో శివాజీకి మళ్లీ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా మరోసారి రాజకీయాల గురించి కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచాడు శివాజీ. ఆ వివరాలు..

బిగ్‌బాస్‌కు వెళ్లడానికి ముందు వరకు కూడా శివాజీ తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగానే ఉన్నాడు. అంతేకాక ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది. కానీ అవన్నీ ఉత్తుత్తి వార్తలే అని తర్వాత తెలిసింది. ఇన్నాళ్లు పవన్‌, చంద్రబాబులకు మద్దతుగా మాట్లాడిన శివాజీ.. సడెన్‌గా తన మాట మార్చారు. తాజాగా ఆయన టీడీపీ-జనసేన పొత్తు గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన వల్ల టీడీపీ ఓడిపోతుంది అన్నారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘జనసేన వల్ల టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా.. అంటే.. నేను ఒక్కటే చెప్తున్నాను.. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమీషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. గత ఎన్నికల్లో జనసేన వల్ల.. టీడీపీ సుమారు 16 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అసలు ఈ రెండు పార్టీల పొత్తుల గురించి నాకు ఓ క్లారిటీ లేదు. రాజకీయ పార్టీలు వాళ్ల అవసరాలు, అవకాశాలు చూసుకుంటాయి. వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు’’అని చెప్పుకొచ్చాడు.

అంతేకాక ‘‘నన్ను పార్టీలోకి రమ్మని ఎవరూ అడగలేదు.. వస్తానని నేను ఎవర్నీ కోరలేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నేను ఆయన్ని ఓ సాయం చేయమని అడిగాను. కానీ చేయలేదు. దాంతో నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అది నా స్వార్థం అని అర్థం అయ్యింది. ఇంతకు ఏం సాయం కోరానంటే.. తెలంగాణ గవర్నమెంట్ వాళ్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. వాళ్లపై కంప్లైంట్ ఇవ్వడానికి ఎఫ్ఐఆర్ విషయంలో సాయం చేయమని అడిగాను. కానీ చంద్రబాబు గారు స్పందించలేదు. కానీ ఆయనపై నాకు కోపం లేదు. ఎందుకంటే అది నా పర్సనల్ పని కాబట్టి.. సర్దిచెప్పుకున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు శివాజీ.