P Krishna
Pawan Kalyan is ill: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ ప్రచారాలతో ఊపేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు.
Pawan Kalyan is ill: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ ప్రచారాలతో ఊపేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలిపి అధికార పార్టీని గద్దె దింపాలని ప్రతిపక్ష నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మరోసారి ఛాన్స్ ఇస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని అధికార పార్టీ ప్రచారం చేస్తుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎవరికి వారే ప్రచారంలో తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
జనసేన నేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న ఆయన వారాహి విజయభేరి షెడ్యూల్ ముందుగానే ఖరారు చేసుకున్నారు. అయితే దాన్ని వాయిదా వేయడం ఇష్టం లేక హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం సహకరించకున్నా ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం శక్తి పీఠాన్ని సందర్శించుకున్న తర్వాత సాయంత్రం హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లిన అక్కడ చికిత్స చేయించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సోమవారం మళ్లీ పిఠాపురంకి చేరుకొని రెండు రోజుల పాటు పర్యటిస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఈ నెల 3 వరకు ఆయన పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటారని జనసేన నేతలు అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే పొలిటికల్ టూర్స్ మధ్యలో ఆపేసి షూటింగ్స్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన పలు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే కమిట్ మెంట్ కొనసాగిస్తున్నారా? అన్న అనుమానాలు సాధారణ ఓటర్స్ లో వ్యక్తతం అవుతున్నాయి. ఏది ఏమైనా ఆయన ఆరోగ్యంతో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.