మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద నెట్ వర్క్. ఇది దేశవ్యాప్తంగా 1.2 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దేశంలో ఎక్కడికైనా అతి తక్కువ ఖర్చుతో తీసుకెళ్ళేది ఒక్క రైలు మాత్రమే. అంతే కాదు ఇందులో ఎన్నో ఉచిత సేవలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అవేంటో ఓసారి చూద్దాం. ఉచితంగా క్లాస్ అప్‌గ్రడేషన్ (Free Class Upgradation): ట్రైన్ లో క్లాస్ అప్‌గ్రడేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే […]
రైలు ప్రయాణాల కోసం ఐఆర్సీటీసీ వంటి యాప్ లు లేదా ఇతర ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేస్తూ ఉంటాం. ప్రయాణంలో బెర్తు ఖరారైతే ఫర్వాలేదు కానీ, ఆర్ఎసీ వచ్చినప్పుడే అసలు కంగారు మొదలవుతుంది. ప్రయాణీకుల్లో ఈ ఆందోళనను తొలగించేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రైలు ప్రయాణాల్లో ఆర్ఏసీ వచ్చినా బెర్తుల కేటాయింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం కేటాయింపులను ఆన్ లైన్ కు మార్చింది. దీని ద్వారా […]
మీరు తరచుగా ప్రీమియం రైళ్ళలో ప్రయాణిస్తారా? వాటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారా? అయితే ఈ వార్త మీకోసమే. ఐఆర్సీటీసీ ఇప్పుడు సర్వీస్ ఛార్జీలపై కొన్ని కొత్త మార్పులు చేసింది. ఇప్పటివరకు టీ, కాఫీలను టికెట్ రిజర్వేషన్ సమయంలోనే ప్రీ బుక్ చేసుకోకుండా, ప్రయాణించేటప్పుడు ఆర్డర్ చేసేవారికి ప్రతి కప్పుకు రూ.50 సేవా రుసుము వసూలు చేస్తోంది. తాజాగా ప్రయాణీకులు అప్పటికప్పుడు ఆర్డర్ చేసేవాటిపై రుసుమును రద్దు చేసింది. ప్రిమీయం రైళ్ళలో రూ.20 కప్పు టీ కోసం మొత్తం రూ.70 చెల్లించేవారు ప్రయాణీకులు. తాజా రూల్స్ ప్రకారం […]
మనలో ప్రతి ఒక్కరం రైలు ప్రయాణం చేసే ఉంటాం. కిటికీ పక్కన కూర్చొని వచ్చే పోయే రైళ్ళను చూస్తూ, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ప్రయాణంలో ఇలాంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అయితే ప్రతి రైలు వెనుక “X” అని రాసి ఉండటాన్ని కచ్చితంగా మీరు గమనించే ఉంటారు. మరి అలా ఎందుకు రాసి ఉంటుందో? దాని అర్థం ఏంటో? తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రండి తెలుసుకుందాం. ప్రతి రైలు బండి వెనుక చివరి కంపార్ట్ మెంట్ పై ఈ ‘X’ గుర్తు […]
ఓ వ్యక్త్తి రైల్వే శాఖ నుంచి రావాల్సిన 35 రూపాయల కోసం ఐదేళ్లు పోరాటం చేసి సాధించాడు. రాజస్తాన్‌కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే 2017 జూలై 2న రాజస్థాన్ కోటా నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఏప్రిల్ లోనే టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తన ప్రయాణం వాయిదా పడటంతో ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని డబ్బులు మినహాయించుకుని మిగిలినవి వెనక్కి వస్తాయి. అయితే సుజీత్ […]
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు 14 గంటల జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది.దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. భారత్‌లో కోవిడ్-19 చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈరోజు వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీ,హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కరోనా వైరస్ సోకిన పాజిటివ్ కేసుల సంఖ్య 370 కి చేరుకోవడంతో పాటు,ఈ వైరస్ బారిన […]
ఇటీవలే ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ ప్రయివేట్ (పిపిపి) భాగస్వామ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 8 రైళ్లు తమ ప్రయాణికులను సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చలేకపోతే, ప్రయాణికులు డబ్బులు వాపస్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కొత్త విధానం ప్రకారం ముందు నిర్ధేశించిన సమయానికన్నా రైలు గంట ఆలస్యం అయితే 100 రూపాయలు, రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ ఆలస్యం అయితే 250 రూపాయలను ప్రతి ప్రయాణికుడికి రీ ఫండ్ చేస్తారు. ప్రయాణికులకు డబ్బులను రి ఫండ్ చేసే బాధ్యతను […]