iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి రీల్స్ చేస్తే జైలుకే

  • Published Nov 16, 2024 | 11:52 AM Updated Updated Nov 16, 2024 | 11:52 AM

Indian Railways: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మీకు రీల్స్ చేసే అలవాటు ఉందా. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇకపై అలా రీల్స్ చేస్తే జైలు తప్పదు.

Indian Railways: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మీకు రీల్స్ చేసే అలవాటు ఉందా. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇకపై అలా రీల్స్ చేస్తే జైలు తప్పదు.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి రీల్స్ చేస్తే జైలుకే

ఇటీవలి కాలంలో రీల్స్ చేయడం ఓ పనిగా పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా కొందరికి ఎంటర్ టైన్ మెంట్ కాగా మరికొందరికి డబ్బు సంపాదనకు మార్గంగా మారింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లో స్టార్స్ అయినవారున్నారు. సెలబ్రిటీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంటున్నారు. డిఫరెంట్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ లక్షల్లో వ్యూస్ పొందుతున్నారు. అయితే అందరిలాగే తాము కూడా ఫేమస్ అవ్వాలని హద్దులు దాటి రీల్స్ చేస్తున్నారు కొందరు. చాలామంది లైక్స్, వ్యూస్, కామెంట్స్ కోసం ప్రమాదకరీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. రీల్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. జలాశయాలు, రైల్వే ట్రాకుల వద్ద, రద్దీగా ఉండే రోడ్లపై రీల్స్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

రైల్వే ట్రాక్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. స్పీడుగా వస్తున్న ట్రైన్ వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సార్లు లోకో పైలట్స్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. రీల్స్ కారణంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా జరిగే నష్టాన్ని ఊహించలేము. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు రీల్స్ చేస్తే జైలు తప్పదు. రైలు పట్టాలపై రకరకాల వస్తువులు ఉంచడం, ప్రమాదకరంగా దాటడం, ట్రాక్ పై డ్యాన్స్ చేయడం, పట్టాలపైకి వాహనాలను తీసుకువస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.

రైల్వే పట్టాలు, స్టేషన్లు, రైళ్లలో రీల్స్ చేసే వారిపై కేసులు పెట్టాలని.. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఇబ్బంది కల్గించేవారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని దేశంలోని అన్ని జోన్లకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా రైల్వే స్టేషన్స్ లో రీల్స్ చేస్తూ, ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తున్నారు. దీంతో వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవడమే కాకుండా రైలు ప్రయాణికుల ప్రాణాలను సైతం డేంజర్ లో పడేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ రైల్వే స్టేషన్లు, రైళ్లలో రీల్స్ చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. రైల్వే శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రూల్స్ అతిక్రమిస్తూ రీల్స్‌ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, జీఆర్పీ పోలీసులకు రైల్వే బోర్డు సూచించినట్లు వెల్లడించారు. ఇక నుంచి రీల్స్ చేసే వారు ఎవ్వరైనా రైల్వేకు చెందిన ప్లేసుల్లో రీల్స్ చేస్తే రైల్వే శాఖ తీసుకునే చర్యలకు గురికావాల్సి ఉంటుంది. మరి రీల్స్ పై రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.