Arjun Suravaram
Waltair Railway Division: 'ట్రైన్ జర్నీలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైల్వే శాఖ అనేక సౌకర్యాలను అందిస్తుంది. అలానే కొత్త కొత్త సదుపాయాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. తాజాగా ఏపీలోని ఉత్తరాంధ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Waltair Railway Division: 'ట్రైన్ జర్నీలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైల్వే శాఖ అనేక సౌకర్యాలను అందిస్తుంది. అలానే కొత్త కొత్త సదుపాయాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. తాజాగా ఏపీలోని ఉత్తరాంధ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా ప్రయాణాలు చేస్తూ..వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. టికెట్ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రైల్వే శాఖ కూడా ప్రయాణికులకు అనేక సదుపాయాలు కల్పిస్తుంది. జర్నీ టైమ్ లో వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అనేక సౌకర్యాలను అందిస్తుంది. అలానే కొత్త కొత్త సదుపాయాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. తాజాగా ఏపీలోని ఉత్తరాంధ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రాంత వాసులకు ఓ సమస్య తీరినట్లు అవుతుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఏపీలో ప్రధానమైన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రాంత పరిధిలో వాల్తేరు డివిజన్ ఉంది. ఈ ప్రాంతం పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ -టికెట్ బుకింగ్ సమయంలో మాత్రమే ఆన్ లైన్ పేమెంట్ ఉండేది. నేరుగా టికెట్ తీసుకునే విషయంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ కి వెళ్లి ప్రయాణించిన రైలుకు సంబంధించి లిక్విడ్ క్యాష్ ఇచ్చి మాత్రమే టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.
చాలా ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్ల్ ఎప్పుడో అందుబాటోలకి వచ్చినా వాల్తేరు డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో మాత్రం వాటిని అనుమించలేదు. ఇంకా చెప్పాలంటే.. ప్లాట్ ఫామ్ టికెట్ ను సైతం డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రిజర్వేషన్ లేని బోగీలలో ఎక్కేవారు సరిగ్గా రైలు వచ్చే సమయానికి కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్యలో సరైనా చిల్లర లేక చాలా ఇబ్బందులు పడే వారు. ఇలాంటి సమస్యకు చెక్ పెడుతూ..తాజాగా రైల్వే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వాల్తేరు డివిజన్ డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి తెచ్చారు. అన్ని రైల్వే స్టేషన్లలోని ప్రతి కౌంటర్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. దానికి యూపీఐ నంబరు కలిగిన ఆన్ లైన్ యాప్ ల ద్వారా డబ్బుల్ని చెల్లించవచ్చు.
వాల్తేరు డివిజన్‌లో ఇప్పటి వరకు 66 స్టేషన్లలో ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం అమలులోకి తీసుకువచ్చినట్టు రైల్వే సీనియర్ అధికారి సందీప్ తెలిపారు. ప్యాసింజర్లు క్యూలో నిల్చోకుండా ఆన్ లైన్ లో పేపర్ లెస్ టికెట్ ను కూడా తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. జనరల్ లో ప్రయాణించే వారి విషయంలో టికెట్ల కొనుగోలుకు ఇబ్బంది లేకుండా యూటీఎస్ యాప్ ద్వారా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఈ డిజిటల్ పేమెంట్లు కేవలం టికెట్ కోసమే కాకుండా, రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ఎటువంటి చెల్లింపులకైనా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. మొత్తంగా రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.