Vinay Kola
Kavach: దేశంలో రైలు ప్రమాదాలు చాలా సాధారణం అయిపోయాయి. రైల్వే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రయాణ మార్గం. రోజుకి లక్షల సంఖ్యలో జనాలు ప్రయాణిస్తూ ఉంటారు.
Kavach: దేశంలో రైలు ప్రమాదాలు చాలా సాధారణం అయిపోయాయి. రైల్వే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రయాణ మార్గం. రోజుకి లక్షల సంఖ్యలో జనాలు ప్రయాణిస్తూ ఉంటారు.
Vinay Kola
దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు చాలా సాధారణం అయిపోయాయి. రైల్వే అనేది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రయాణ మార్గం. అందువల్ల రోజుకి లక్షల సంఖ్యలో జనాలు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ రైలు ప్రమాదాల ద్వారా భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. గతంలో కూడా జరిగింది. ఈమధ్యనే గత జూలై నెలలో ఏకంగా రెండు వరుస రైలు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాలు జనాలను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. దీంతో రైలు ప్రయాణాలు అంటేనే అందరికి భయం పుట్టుకోస్తుంది. ఇలాంటి రైలు ప్రమాదాలను తగ్గించడం అంత సులభమైన పని కాదు. కానీ ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ అలాంటి ప్రమాదాలు జరగకూడదని వాటిని తగ్గించేందుకు చాలా తీవ్రంగా పని చేస్తుంది.
ఈ క్రమంలో రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఓ టెక్నాలజీని ఇండియన్ రైల్వే అభివృద్ధి చేస్తుంది. తాజాగా ఆ టెక్నాలజీ సక్సెస్ అయ్యిందని సమాచారం తెలుస్తుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు. ఇండియన్ రైల్వే ఇటీవల ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని పరీక్షించింది. ఈ ప్రయోగం సఫలం అయింది. కొత్తగా రైల్వే టెస్ట్ చేసిన ఆటోమేటిక్ ట్రైన్ సేఫ్టీ సిస్టమ్ టెక్నాలజీ పేరు ‘కవచ్’. రీసెంట్ గా వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని సవాయ్ మడోబర్ ఇంకా ఇంటర్ గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య రైలును నడిపారు. ఈ రైలుని గంటకు 130 కిలోమీటర్ల మాక్సిమం స్పీడ్ తో నడిపారు. రెడ్ సిగ్నల్‌కి చేరుకోగానే సిగ్నల్ 50 మీటర్ల దూరంలో రైలు ఫుల్ స్పీడుతో ఆగింది. పైగా పైలట్ అవసరం లేకుండానే ఆ రైలు ఆగిపోయింది. మంత్రి వైష్ణవ్ కూడా ఈ రైలులో ప్రయాణించారు. ఈ రైలుకు కేవలం రెడ్ సిగ్నల్‌తో రైలు ఆగిపోవడమే కాకుండా మొత్తం ఏడు రకాల పరీక్షలు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
ఈ కవచ్ టెక్నాలజీ అనేది కేవలం ఎమర్జెన్సీ బ్రేకింగ్ గానే కాకుండా స్పీడ్ లిమిటర్‌గా కూడా పనిచేస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. దీన్ని పరీక్షించే సమయంలో రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పోయింది. అలా పోయే సమయంలో లూప్ లైన్లలో ఈ రైలు వేగం గంటకు 30 కిలోమీటర్లకు తగ్గిపోయింది. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కవచ్ ఈ పనులు చేయడం విశేషం. సవాయ్ మడోబర్, ఇంటర్ గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య పాడైపోయిన ట్రాక్‌కి సంబంధించిన వివరాలను స్టేషన్ మాస్టర్ కవచ్‌కి సూచించారు. అందుకు తగ్గట్లు ట్రైన్ స్పీడ్ తగ్గించి లోడ్ చేశారు. ఇది లెవెల్ క్రాసింగ్ అప్పుడు ఆటోమేటిక్‌గా హారన్, విజిల్ కూడా మొగుతుంది.
భారతీయ రైల్వే ఈ కవచ్ టెక్నాలజీని ఇంకా అప్ డేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. వచ్చే ఆరేళ్ల లోపు కొత్త వెర్షన్‌ని అభివృద్ధి చేస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఆటోమేటిక్ రైల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని RDSO రెడీ చేసింది. భారతీయ రైల్వే ముందుగా ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-కోల్‌కతా మార్గాల్లో ఈ అప్డేటెడ్ టెక్నాలజీని సిద్ధం చేసే పనిలో పడింది. ఎందుకంటే ఈ కారిడార్ల మధ్య 3,000 కిలోమీటర్ల దూరం ఉంది. మిగతా రూట్లలో కూడా కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. టెస్ట్ చేసే సమయంలో కవచ్ 4.0ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ అన్ని భూభాగాలని తట్టుకునే శక్తి కలిగి ఉంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చిందంటే రైలు ప్రమాదాలు జరగవు. మరి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఈ కవచ్ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.