iDreamPost
android-app
ios-app

వందే భారత్ రైళ్లు: 100 ట్రైన్స్ కోసం 30 వేల కోట్ల టెండర్.. క్యాన్సిల్ చేసిన ఇండియన్ రైల్వేస్..

  • Published Aug 14, 2024 | 3:10 AM Updated Updated Aug 14, 2024 | 7:55 AM

Indian Railways-Vande Bharat Trains: తక్కువ ఖర్చుతో 100 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తుంది. అయితే ఇండియన్ రైల్వేస్ అనుకున్న బడ్జెట్ 30 వేల కోట్లు. కానీ ఈ బడ్జెట్ లో చేయలేమని రెండు కంపెనీలు చెప్పేశాయి.

Indian Railways-Vande Bharat Trains: తక్కువ ఖర్చుతో 100 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తుంది. అయితే ఇండియన్ రైల్వేస్ అనుకున్న బడ్జెట్ 30 వేల కోట్లు. కానీ ఈ బడ్జెట్ లో చేయలేమని రెండు కంపెనీలు చెప్పేశాయి.

వందే భారత్ రైళ్లు: 100 ట్రైన్స్ కోసం 30 వేల కోట్ల టెండర్.. క్యాన్సిల్ చేసిన ఇండియన్ రైల్వేస్..

అల్యూమినియం బాడీతో వంద వందే భారత్ రైళ్ల తయారీ కోసం ఇండియన్ రైల్వేస్ గతంలో ఆల్స్టోమ్ ఇండియా అనే కంపెనీకి 30 వేల కోట్ల రూపాయల టెండర్ ని ఇచ్చింది. అయితే తాజాగా ఆ టెండర్ ని రద్దు చేసినట్లు ఆల్స్టోమ్ ఇండియా కంపెనీ ఎండీ ఒలీవియర్ లోయిసన్ ధృవీకరించారు. ఆల్స్టోమ్ ఇండియా ఎక్కువ ధర కోట్ చేయడంతో ఇండియన్ రైల్వేస్ టెండర్ ని క్యాన్సిల్ చేసింది. పలు నివేదికల ప్రకారం.. ఆల్స్టోమ్ అనే ఫ్రెంచ్ మల్టీనేషనల్ కంపెనీ ఒక వందే భారత్ రైలు తయారీ, మెయింటనెన్స్ కి 150.9 కోట్ల రూపాయల ధరను కోట్ చేసింది. అయితే ఇండియన్ రైల్వేస్ ఈ డీల్ ని ఒక రైలుకి 140 కోట్లకు క్లోజ్ చేయాలని చూస్తుంది. 100 వందే భారత్ రైళ్ల కోసం 30 వేల కోట్ల అత్యంత తక్కువ మొత్తంతో తయారుచేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ రైల్వేస్.

ఈ బిడ్డింగ్ ప్రక్రియలో రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనడంతో.. కొత్త టెండర్ ని ఆహ్వానిస్తే పోటీ పెరిగి తక్కువ ధరకే కోట్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఒకవైపు ఆల్స్టోమ్ ఇండియా కంపెనీ బిడ్డింగ్ లో పాల్గొనగా.. మరోవైపు స్టాడ్లర్ రైల్ అనే స్విస్ తయారీ కంపెనీ హైదరాబాద్ కి చెందిన మేధా సర్వో డ్రైవ్స్ తో కలిసి బిడ్డింగ్ లో పాల్గొంది. ఈ స్టాడ్లర్ కంపెనీ ఒక వందే భారతభారత్ రైలుని తయారుచేసేందుకు 170 కోట్ల రూపాయలను కోట్ చేసింది. గతంలో 200వ భారత స్లీపర్ రైలు సెట్స్ ని తయారుచేసేందుకు ఒక్కో రైలుకి 120 కోట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు టెండర్ తర్వాత రౌండ్ లో ఎక్కువ మంది బిడ్డర్స్ ని ఆహ్వానిస్తే బెస్ట్ ధరకే అంటే తక్కువ ధరకే డీల్ క్లోజ్ చేయవచ్చునని ఇండియన్ రైల్వేస్ భావిస్తుంది.

ఈ టెండర్ లో పాల్గొనే కంపెనీలకు ఏడాదికి ఐదు రైళ్ల సెట్స్ ని తయారుచేసే సామర్థ్యం కలిగి ఉండడంతో పాటు పరిశోధన, అభివృద్ధి వంటి వాటిలో కేపబిలిటీస్ ఉండాలి. ఈ బిడ్డింగ్ లో గెలిచిన కంపెనీకి రైళ్లను డెలివరీ చేసే సమయానికి 13 వేల కోట్ల రూపాయలను ఇండియన్ రైల్వేస్ చెల్లిస్తుంది. మిగతా 17 వేల కోట్ల రూపాయలను మెయింటెనెన్స్ కోసం 35 ఏళ్ల పాటు చెల్లిస్తుంది. 100 అల్యూమినియం బాడీతో వందే భారత్ రైళ్లను ఏడేళ్లలో తయారు చేసి ఇవ్వడానికి కంపెనీలను

2022లో బిడ్డింగ్ కి ఆహ్వానించింది ఇండియన్ రైల్వేస్. బిడ్డింగ్ ప్రక్రియ 2023 మే 30న నిర్వహించబడింది. ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా అల్యూమినియం రైళ్లను తయారు చేయమని అడగడానికి కారణం అవి తేలికగా ఉండడంతో పాటు ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. స్టెయిన్ లెస్ స్టీల్ తో చేసిన రైళ్లతో పోలిస్తే అల్యూమినియం బాడీతో చేసిన రైళ్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అందుకే ఇండియన్ రైల్వేస్ అల్యూమినియం రైళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈ రిక్వైర్మెంట్స్ తో ఆ బడ్జెట్ లో చేయడం కష్టమని కంపెనీలు చెప్పడంతో ఇండియన్ రైల్వేస్ వేరే కంపెనీలను ఆహ్వానిస్తుంది. ఇక వందే భారత్ రైలు సెమీ హై స్పీడ్ రైలు. ఇది 16 స్వీయ చోదక కోచ్ లను కలిగి ఉంటాయి. దీని వల్ల ప్రత్యేకంగా లోకోమోటివ్ అవసరం లేదు. బెటర్ సీటింగ్, ఎయిర్ కండిషనింగ్ లో యాంటీ బ్యాక్టీరియల్ సిస్టంతో వస్తుంది. ఇది 140 సెకన్లలో గంటకు 160 కి.మీ. సామర్థ్యాన్ని అందుకోగలదు.