iDreamPost
android-app
ios-app

Indian Railways: రైల్వే నుంచి సూపర్ యాప్.. ఇక సర్వీసులన్నీ చాలా ఈజీ!

  • Published Nov 22, 2024 | 12:11 PM Updated Updated Nov 22, 2024 | 12:11 PM

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రజలకు ఈజీగా అన్నీ సర్వీస్ లను అందించడానికి రెఢీ అవుతుంది. తాజాగా ఓ సూపర్ యాప్ ని తీసుకు రాబోతుంది.

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రజలకు ఈజీగా అన్నీ సర్వీస్ లను అందించడానికి రెఢీ అవుతుంది. తాజాగా ఓ సూపర్ యాప్ ని తీసుకు రాబోతుంది.

Indian Railways: రైల్వే నుంచి సూపర్ యాప్.. ఇక సర్వీసులన్నీ చాలా ఈజీ!

Indian Railways రోజు రోజుకూ టెక్నాలజీ వాడకంలో దూసుకుపోతోంది. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాడుతున్న యాప్‌. రైళ్లలో ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐఆర్‌సీటీసీ యాప్ ని వాడుతున్నారు. అయితే టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేరే యాప్‌లు, వెబ్‌సైట్‌లు వాడాలి. ఇక ఈ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ ను తీసుకొస్తోంది. ఈ యాప్ లో అన్ని రకాల రైల్వే సర్వీసెస్ ఒకేచోట అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఇక నుంచి ఈ యాప్‌లోనే టికెట్స్‌ బుకింగ్‌ (Train Tickets Booking), పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ (PNR Status), ట్రైన్‌ ట్రాకింగ్‌ (Train Tracking) ఇంకా చాలా సర్వీసులు ఉంటాయి. రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ (Order Food) కూడా చేసుకోవచ్చు. ఇక.. ప్లాట్‌ఫారమ్‌ టికెట్ నుంచి జనరల్‌ టికెట్‌ దాకా ఆన్‌లైన్‌ మోడ్‌లో కొనే అవకాశం ఉంటుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ సూపర్ యాప్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను ఏకంగా 10 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుతున్నారు. ప్రస్తుతానికి ఇదే ఎక్కువ ప్రజాదరణ పొందిన రైల్వే యాప్‌గా రన్ అవుతుంది. రైల్ మదద్, యూటీఎస్, సటార్క్, టీఎమ్‌సీ-నిరీక్షన్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్‌రీడ్‌, వేర్ ఈజ్ మై ట్రైన్ వంటి యాప్‌లు కూడా రైల్వే సర్వీస్ లను ప్రజలకు అందిస్తున్నాయి. అయితే ఈ యాప్స్ లో ఉన్న అన్నీ సర్వీస్ లను ఓకే సూపర్ యాప్ ద్వారా ఇచ్చేందుకు మన ఇండియన్ రైల్వే ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుంది. ఇక తాజాగా ఈ సూపర్ యాప్ ని లాంచ్ చేసేందుకు రెఢీ అవుతుంది.

ఇక ఇప్పటికే ఈ సూపర్ యాప్‌ రెఢీ అయ్యిందట. దీన్ని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. ప్రస్తుతం ఈ సూపర్‌ యాప్‌ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC)తో లింక్ చేసే ప్రాసెస్ జరుగుతుందని తెలుస్తుంది. వచ్చే డిసెంబర్‌ నాటికి ఈ యాప్ కంప్లీట్ గా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రయాణికులకు ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా అన్నీ సర్వీసులు అందుతాయి. రైలు ప్రయాణం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇక ఈ సూపర్ యాప్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.