iDreamPost
android-app
ios-app

ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ రూల్స్ మారాయ్.. ఇకపై 120 రోజుల ముందుగా కుదరదు

IRCTC Rules: మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇకపై 120 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్ కుదరదు. బుకింగ్ నిబంధనలు మారాయి.

IRCTC Rules: మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇకపై 120 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్ కుదరదు. బుకింగ్ నిబంధనలు మారాయి.

ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ రూల్స్ మారాయ్.. ఇకపై 120 రోజుల ముందుగా కుదరదు

ట్రైన్ జర్నీని సామాన్యుడి విమాన ప్రయాణంగా చెబుతుంటారు. నిత్యం వేలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ట్రైన్ జర్నీకే మొగ్గు చూపిస్తారు. సామాన్య ప్రజానీకం ప్రయాణాల కోసం భారతీయ రైల్వే మీద ఆధారపడుతుంటారు. ప్రయాణ చార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికి ప్రాధాన్యత పెరిగింది. ఇక పండగల సమయాల్లో రద్దీ ఓ రేంజ్ లో ఉంటుంది. వందల కొద్ది ట్రైన్స్ ఉన్నప్పటికీ కిక్కిరిసిపోతుంటాయి. అందుకే ప్రయాణం చేయడానికి కొన్ని రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకుంటారు. మరి మీరు కూడా ఈ మధ్య కాలంలో ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా? టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే.

టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు 4 నెలలు ముందుగానే అంటే ట్రైన్ షెడ్యూల్ డేట్కు 120 రోజుల ముందుగా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇకపై అలా కుదరదు. ముందస్తు బుకింగ్ వ్యవధిని తగ్గించింది 2 నెలలకు తగ్గించింది. ఇకపై.. 60 రోజుల ముందు నుంచి మాత్రమే ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్ నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. అంటే నవంబర్ 1 నుంచి టికెట్స్ బుకింగ్ చేసుకునే వారు 60 ముందు నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

అయితే.. ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు ఈ నిబంధన వర్తించదని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ అక్టోబర్ 31 వరకు బుక్ చేసుకునే వారికి పాత రూల్స్ వర్తించనున్నాయి. ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ రోజుల వ్యవధిని తగ్గించడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే గడువు కుదింపు వల్ల టికెట్ క్యాన్సిలేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఐఆర్ సీటీసీకి ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టికెట్లు కేన్సిల్‌ చేసుకుంటే ఐఆర్‌సీటీసీ భారీగా కేన్సిలేషన్‌ ఛార్జీలు వసూలు చేస్తుంది.

రైలు చార్టు తయారీకి ముందు క్యాన్సిల్‌ చేస్తే తక్కువ చార్జీ, కన్ఫార్మ్‌ టికెట్‌లను క్యాన్సిల్‌ చేసుకుంటే మరింత ఎక్కువ ఫైన్‌ పడుతుంది. ఉదాహరణకు ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ టికెట్ క్యాన్సిల్‌ చేస్తే రూ. 240 ఛార్జ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లేదా ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ-టైర్, ఏసీ త్రీ-టైర్ వంటి క్లాసులపై క్యాన్సిలేషన్‌ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. మరి టికెట్ అడ్వాన్స్ బుకింగ్ రోజుల వ్యవధిని తగ్గించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.