iDreamPost
android-app
ios-app

ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయిన సాధారణ రైతు.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Nov 13, 2024 | 12:32 PM Updated Updated Nov 13, 2024 | 12:32 PM

Swarn Shatabdi Express: రైల్వే వ్యవస్థ ప్రభుత్వ ఆస్తి. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధం ఉండదు. కానీ ఓ రైతు మాత్రం ఏకంగా రైలుకు ఓనర్ అయ్యాడు. అసలు ఏం జరిగిందంటే?

Swarn Shatabdi Express: రైల్వే వ్యవస్థ ప్రభుత్వ ఆస్తి. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధం ఉండదు. కానీ ఓ రైతు మాత్రం ఏకంగా రైలుకు ఓనర్ అయ్యాడు. అసలు ఏం జరిగిందంటే?

ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయిన సాధారణ రైతు.. అసలు ఏం జరిగిందంటే?

భారతీయ రైల్వే ఆసియా ఖండంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి ఉంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ విశేషమైన ఆదరణ పొందింది. సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు అంతా రైలు ప్రయాణానికే మొగ్గు చూపిస్తుంటారు. ప్రయాణ చార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవుతుండడంతో ట్రైన్ జర్నీకి డిమాండ్ ఎక్కువ. అయితే రైల్వే వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తుంది. భారతీయ రైల్వేపై సర్వ హక్కులు సెంట్రల్ గవర్నమెంట్ కలిగి ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి అధికారం ఉండదు.

కానీ ఓ రైతు మాత్రం ఓ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు ఓనర్ అయ్యాడు. రైతేంటి? రైలుకు ఓనర్ అవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది వినడానికి నమ్మశక్యంగా లేకున్నా వాస్తవంగా జరిగన ఘటనే. రైల్వే శాఖ చేసిన తప్పు సాధారణ రైతును రైలుకు ఓనర్ ను చేసింది. సాధారణంగా ధనవంతులకు విమానాలు, హెలికాఫ్టర్లు ఉంటాయి. కానీ రైలుకు యజమానులు ఉండడం ఎప్పుడు విన్నది లేదు. కానీ, సాధారణ రైతు మాత్రం రైలుకు యజమాని అయ్యాడు. అసలు ఏం జరిగిందంటే.. పంజాబ్‌లోని లుథియానా జిల్లా కటానా గ్రామానికి చెందిన సంపూరణ్ సింగ్ శతాబ్జి ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమానిగా ఉన్నాడు. ఇది కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. 2007లో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్‌ నిర్మాణానికి రైల్వే అధికారులు భూసేకరణ చేపట్టారు.

కటానా గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. రైల్వే అధికారులు పరిహారాన్ని నిర్ణయించిన తర్వాత తమ సమీప గ్రామంలో ఎకరానికి రూ.71 లక్షలు చొప్పున రైల్వే అధికారులు ఇచ్చినట్లు సంపూరణ్‌ సింగ్‌ గుర్తించాడు. ఈ క్రమంలో తనకు అన్యాయం జరిగిందంటూ రైతు సంపూరణ్ సింగ్ న్యాయపోరాటానికి సిద్ధమై కోర్టును అశ్రయించారు. తమకు కూడా రూ.71 లక్షల పరిహారం ఇవ్వాలని సంపూరణ్ సింగ్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఎకరానికి పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. అయినా సంపూరణ్ సింగ్ వెనక్కి తగ్గలేదు.

చివరికి ఆ పరిహారం కాస్తా రూ.1.47 కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని 2015 లోగా సంపూరణ్ సింగ్‌కు చెల్లించాలని కోర్టు నార్తన్‌ రైల్వే అధికారులను ఆదేశించింది. రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుకు పరిహారాన్ని చెల్లించలేదు. దీంతో సంపూరణ్‌ సింగ్‌ 2017లో మరోసారి కోర్టును ఆశ్రయించారు. 2017 వరకు రైల్వే శాఖ తనకు కేవలం రూ. 42 లక్షలు మాత్రమే చెల్లించిందని.. కోర్టు ఆదేశించిన పూర్తి పరిహారాన్ని చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి జస్పాల్‌ వర్మ సంచలనం తీర్పు వెలువరించారు.

ఢిల్లీ-అమృత్‌సర్‌ మధ్య నడిచే స్వర్ణ్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలుతో పాటు, లుథియానాలోని స్టేషన్‌ మాస్టర్‌ ఆఫీస్‌ను కూడా జప్తు చేయాలని జడ్జీ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ఓనర్ అయి సంపూరణ్ సింగ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును రైల్వే అధికారులు పై కోర్టులో అప్పీల్ చేశారు. విచారణ అనంతరం డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఆ ఆదేశాలను రద్దు చేసింది. రైల్వే అధికారుల తప్పిదం సాధారణ రైతును రైలుకు ఓనర్ అయ్యేలా చేసింది. మరి రైతు ట్రేన్ కు యజమాని అయిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.