iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. క్యూఆర్ కోడ్‌తో టికెట్స్ కొనొచ్చు

  • Published Aug 15, 2024 | 5:33 AM Updated Updated Aug 15, 2024 | 12:22 PM

South Central Railway Says Good News To Passengers: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్యకు చెక్ పెట్టింది. రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కీలక నిర్ణయం తీసుకుంది.

South Central Railway Says Good News To Passengers: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్యకు చెక్ పెట్టింది. రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. క్యూఆర్ కోడ్‌తో టికెట్స్ కొనొచ్చు

భారతదేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వారి అవసరాలకు తగ్గట్టు రైల్వేశాఖ కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు సరికొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణికుల కష్టాలను గుర్తించి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చింది. అతి పెద్ద సమస్యకు చెక్ పెట్టేలా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు ఎదుర్కుంటున్న సమస్యను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే పరిష్కారంగా కొత్త డివైజ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డివైజ్ తో మరింత సులువుగా, వేగంగా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు.     

దక్షిణ మధ్య రైల్వే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలు విషయంలో ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ తీసుకునే సమయంలో చిల్లర సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే గుర్తించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చింది. కౌంటర్ లో టికెట్లను క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసి కొనుగోలు చేసే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చునని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తొలుత ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని రైల్వేస్టేషన్లకూ విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అన్ని రైల్వేస్టేషన్ కౌంటర్ల టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్ ని ఉంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రయాణికులకి సంబంధించిన వివరాలు, టికెట్ ధర వంటివి కంప్యూటర్ లో నమోదు చేసిన తర్వాత ప్రత్యేక డివైజ్ లో క్యూఆర్ కోడ్ వస్తుంది. ప్రయాణికులు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక ప్రయాణికులకు టికెట్లు అందిస్తారు. దీంతో చిల్లర సమస్యలు తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వేస్టేషన్లకే పరిమితమైన డిజిటల్ పేమెంట్ సదుపాయాన్ని ఇప్పుడు అన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించింది. అన్ని స్టేషన్లకు ఈ ప్రత్యేక డివైజ్ లను పంపించింది. దశల వారీగా అన్ని స్టేషన్లలో డిజిటల్ పేమెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ డిజిటల్ పేమెంట్ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.