iDreamPost
android-app
ios-app

మీకు జాబ్ కావాలా?.. రైల్వేలో 7,934 జాబ్స్ రెడీ.. నెలకు 44 వేల జీతం

RRB Recruitment 2024: మీకు ఈ అర్హతలు ఉన్నాయా? రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా 7,934 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

RRB Recruitment 2024: మీకు ఈ అర్హతలు ఉన్నాయా? రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా 7,934 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీకు జాబ్ కావాలా?.. రైల్వేలో 7,934 జాబ్స్ రెడీ.. నెలకు 44 వేల జీతం

రైల్వేలో జాబ్ కొట్టాలని తెగ ట్రై చేస్తుంటారు. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా అంటూ వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్. మీకు జాబ్ కావాలా? రైల్వేలో 7934 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు నిరుద్యోగులుగా మిగిలిపోకూడదంటే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. రైల్వేలో ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారికి లైఫ్ లో మళ్లీ రాని అవకాశమిది. ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భారీ సంఖ్యలో జూనియర్‌ ఇంజినీర్‌ రిక్రూట్‌మెంట్ 2024 షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 7,934 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ లేదా బీఈ డిగ్రీ లేదా డిప్లొమా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జులై 30 నుంచి ప్రారంభంకానుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 7934

అర్హత:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ లేదా బీఈ డిగ్రీ లేదా డిప్లొమా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 500.ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళా, ట్రాన్స్‌జెండర్లకు రూ. 250 గా నిర్ణయించారు.

ఎంపిక విధానం:

  • సీబీటీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • కెమికల్ సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 44900 జీతం, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 35400 చెల్లిస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 30-07-2024

దరఖాస్తుకు చివరీ తేదీ:

  • 29-08-2024