iDreamPost
android-app
ios-app

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. గోవాకు నేరుగా ట్రైన్.. వివరాలు ఇవే!

Telangana, Goa Train: నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదే సమయంలో రైల్వే శాఖ కూడా ప్రయాణికులకు అనేక సదుపాయాలను కల్పిస్తుంది. తాజాగా తెలంగాణ రైల్వే ప్రయాణికులకతో పాటు ఏపీ ప్రయాణికులకు రైల్వే అధికారులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

Telangana, Goa Train: నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదే సమయంలో రైల్వే శాఖ కూడా ప్రయాణికులకు అనేక సదుపాయాలను కల్పిస్తుంది. తాజాగా తెలంగాణ రైల్వే ప్రయాణికులకతో పాటు ఏపీ ప్రయాణికులకు రైల్వే అధికారులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. గోవాకు నేరుగా ట్రైన్.. వివరాలు ఇవే!

భారతీయ రైల్వే వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదే సమయంలో రైల్వే శాఖ కూడా ప్రయాణికులకు అనేక సదుపాయాలను కల్పిస్తుంది. డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు రైళ్లను ఏర్పాటు చేయడం, ఇతర అనేక సేవలను రైల్వేశాఖ అందిస్తుంది. అలానే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు రైల్వే అధికారులు ఓ సూపర్ న్యూస్ చెప్పారు. దీంతో గోవా పర్యాటక ప్రాంతానికి వెళ్లే రైల్వే ప్రయాణికులు జర్నీ ఈజీ కానుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నిత్యం చాలా మంది ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్తుంటారు.  అయితే పూర్తి స్థాయిలో నేరుగా తెలుగు రాష్ట్రాల నుంచి గోవాలకు వెళ్లే ట్రైను అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే గోవాకు వెళ్లాలనుకునేవారి కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ఓ శుభవార్త చెప్పింది. త్వరలో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా వాస్కోడిగామా రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ రైలు వారంలో రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు మనం చూసినట్లు అయితే.. సికింద్రాబాద్ నుంచి గోవాకు వీక్లి సర్వీసు మాత్రమే ఉండేది. అలానే కాచిగూడ నుంచి నాలుగు బోగీల ద్వారా గోవాకు సర్వీసు అందుబాటులో ఉంది. ఆ బోగీలను కూడా గుంతకల్‌ దగ్గర గోవా రైలుతో లింక్ ఉండేది.

Good news for people of Telangana Direct train to Goa

ఇక కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ కొత్త ట్రైన్ బుధ, శుక్ర వారాల్లో సికింద్రబాద్ నుంచి వాస్కోడిగామకు వెళ్తనుంది. అలానే గురు, శనివారాల్లో అక్కడి నుంచి సికింద్రబాద్ కు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ట్రైన్ల టిక్కెట్‌ ధరలను త్వరలో వెల్లడిస్తారని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక సికింద్రబాద్ నుంచి నేరుగా గోవా వెళ్లనున్న ఈ ట్రైన్ కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ గా ట్రైన్ నడపాలని రైల్వేశాఖకు రిక్వెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి విజ్ఞప్తి మేరకు మరో వారం రోజుల్లో ఈ రైలును ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.  ప్రతి ఏటా గోవాలకు వెళ్లే వారిలో 20 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారే ఉంటారు.

వీరిలో చాలా మంది ఏపీ, తెలంగాణ నుంచి డైరెక్ట్ గా గోవాకు ట్రైన్ లేక..ఇతర మార్గాలను ఎంచుకునే వారు. ఉన్న వీక్లి సర్వీసుకు ఫుడ్ డిమాండ్ ఉంది. అందుకే సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలును తీసుకొచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ – గోవా మధ్య నడిచే రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఈ రైలుకు పచ్చజెండా వచ్చింది. మొత్తంగా గోవాల వెళ్లాలని అనుకునే తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.