P Venkatesh
South Central Railway: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. సౌత్ సెంట్రల్ రైల్వే ఏకంగా 94 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఏయే ట్రైన్స్ ఎప్పటి వరకు రద్దుకానున్నాయంటే?
South Central Railway: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. సౌత్ సెంట్రల్ రైల్వే ఏకంగా 94 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఏయే ట్రైన్స్ ఎప్పటి వరకు రద్దుకానున్నాయంటే?
P Venkatesh
భారతీయ రవాణా వ్యవస్థలో కీలకమైన రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే డిపార్ట్ మెంట్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ఆధునీకీకరణ పనులు, స్టేషన్లలో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది రైల్వే డిపార్ట్ మెంట్. మరి మీరు ఈ మధ్యన రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. సౌత్ సెంట్రల్ రైల్వే ఏకంగా 94రైళ్లను రద్దు చేసింది. 41 రైళ్లను దారి మళ్లించారు, మరో 27 రైళ్ల టైమింగ్స్ మార్చారు. ఇంతకీ ఏయే ట్రైన్స్.. ఎప్పటి వరకు రద్దు కానున్నాయంటే?
ఇటీవల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, ఆధునీకీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో.. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో 94 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రద్దయిన ట్రైన్లలో సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని ట్రైన్లు ఉన్నాయి. ఫలితంగా కొన్ని ట్రైన్లు ఒక రోజు, కొన్ని ట్రైన్లు 15 రోజులు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఏయే ట్రైన్లు రద్దయ్యాయో ముందే తెలుసుకుంటే మీ ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ సమయం వృథా కాదు.