ఆర్మీలో ఉద్యోగాల కోసం వారంతా చాలా కష్టపడ్డారు. సగం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. రన్నింగ్, లాంగ్ జంప్ వంటి వాటన్నింటిలోనూ శిక్షణ పొంది ఉన్నారు. ఈ క్రమంలో తమ పరీక్షను రద్దు చేశారన్న కోపంలో సృష్టించిన విధ్వంసానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిన్న ఆందోళనకారులు చేసిన విధ్వంసానికి జీఆర్పీ పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇరుక్కుంటే.. ఆర్మీ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకూ […]
రోడ్డు మార్గాన సూర్యాపేట వెళ్లి… విద్యానగర్‌లో ఉన్న కల్నల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులను ఓదార్చి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు భార్యకు రూ.4 కోట్లు, ఆయన తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కులను అందజేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 711 చదరపు గజాల స్థలం, కమర్షియల్ ట్యాక్స్ అధికారి (గ్రూప్-1)గా ఉద్యోగ నియామక పత్రాలను సంతోష్‌బాబు భార్య సంతోషికి స్వయంగా అందజేశారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని […]
భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జూన్ 16న సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది సైనికులు వీర మరణం పొందారు. నాటి నుంచి చైనాపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం హోరెత్తుతోంది. మరోవైపు.. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ సమాయత్తమవుతోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చర్చలు జరుపుతూనే.. అవసరమైతే డ్రాగన్ ను ఎదిరించేందుకు సిద్ధమవుతోంది. సైనికులను సమాయత్తం చేస్తోంది. కావాల్సి వస్తే.. మరింత […]
భారత్-చైనా సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత పెరిగిపోతోంది. సోమవారం అర్ధరాత్ర తర్వాత చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత్ కు చెందిన ఓ ఆర్మీ అధికారితో పాటు ఇద్దరు జవాన్లు మరణించారు. కొద్ది రోజులుగా భారత భూభాగంలోకి చైనా ఆర్మీ చొచ్చుకుని వచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలోని లడ్డఖ్ లో సుమారు 35 కిలోమీటర్ల భూభాగంలోకి చైనా సైన్యం చొరబడిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా చైనా ఆర్మీ భారత్ జవాన్లను రెచ్చ గొడుతోంది. […]
ఆస్పత్రులపై హెలికాఫ్టర్లతో పూల వాన ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ నుంచి ప్రజలను రక్షించేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలు అజారామరం. వందలాది మందికి అవిశ్రాంతంగా స్వు అందిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగుల ప్రాణాలు కాపాడేందుకు వారు విశ్రాంతంగా పని చేస్తున్నారు..ఈ విపత్కాలంలో వారి సేవలు వెలకట్టలేనివి.బదులు తీర్చుకోలేనివి.అందుకే వారికి దేశం యావత్తు జేజేలు పలుకుతోంది. నిరంతర పోరాటంలో 24 గంటలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఘనంగా వందన సమర్పణ చేస్తోంది వాయుసేన. దేశ […]
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై ఆర్మీ నూతన చీఫ్ ముకుంద్ నరవనే కుండబద్దలు కొట్టారు. పీఓకే మనదేనని, ఆపరేషన్ పీఓకే నిర్వహించేందుకు తాము సిద్ధమేనని ముకుంద్ నరవనే చెప్పారు. ఈ రోజు ఢిల్లీ లో మీడియా సమావేశంలో నరవనే మాట్లాడుతూ.. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంటు నిర్ణయించి, తమకు అనుమతి ఇస్తే.. ఆ ప్రాంతం తిరిగి మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందితే తక్షణమే పీఓకే కోసం తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు […]