iDreamPost
android-app
ios-app

మీ పిల్లలకు బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నారా?.. ఆర్మీ స్కూల్స్‌లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి

Rashtriya Military Scholls: మీ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు బెస్ట్ స్కూల్ కోసం చూస్తున్నారా? అయితే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

Rashtriya Military Scholls: మీ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు బెస్ట్ స్కూల్ కోసం చూస్తున్నారా? అయితే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీ పిల్లలకు బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నారా?.. ఆర్మీ స్కూల్స్‌లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి

పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టకపోయినా పర్వాలేదు కానీ మంచి విద్యను మాత్రం అందించాలి. పేదరికాన్ని పారద్రోలి, జీవితాల్లో వెలుగులు నింపేది చదువు ఒక్కటే. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది విద్య. కనుకనే తల్లిదండ్రులు కాయాకష్టం చేసైనా సరే తమ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందించాలని ఆలోచిస్తున్నారు. ఖర్చులకు వెనకాడకుండా నాణ్యమైన విద్యనందించే స్కూల్స్ కు పంపిస్తున్నారు. మరి మీరు కూడా మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మిలిటరీ స్కూల్స్ లో చేర్పించండి. రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి 6,9 తరగతిలో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

అందరికీ విద్యనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కేంద్రీయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, గురుకులాల ద్వారా విద్యనిందిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న మిలిటరీ స్కూల్స్ లో ప్రవేశాల కోసం ప్రకటన వెలువడింది. చైల్ (హిమాచల్ ప్రదేశ్), అజ్‌మేర్‌ (రాజస్థాన్), ధోల్‌పుర్‌ (రాజస్థాన్), బెల్గాం (కర్ణాటక), బెంగళూరు (కర్ణాటక) స్కూళ్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ స్కూల్స్ లో అడ్మిషన్ పొందాలంటే.. ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 రాయాల్సి ఉంటుంది.

అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ తదితర వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన ఉంటుంది. వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలు అడ్మిషన్ పొందొచ్చు. ఈ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదన ఉంటుంది. అప్లై చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అర్హతలు:

ఆర్మీ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2025 మార్చి 31 నాటికి విద్యార్థి వయస్సు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి 2025, మార్చి 31 నాటికి అభ్యర్థి వయస్సు 13 ఏళ్ల కంటే తక్కువ, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. 9వ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.