iDreamPost
android-app
ios-app

ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ ఆర్మీలో ఫ్రీగా BTech, ఆపై ఉద్యోగం కూడా!

10+2 Technical Entry Scheme 2025: మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఇండియన్ ఆర్మీలో ఉచితంగా బీటెక్ కోర్స్ చేసి జాబ్ పొందండి. ఇందుకోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన విడుదలైంది.

10+2 Technical Entry Scheme 2025: మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఇండియన్ ఆర్మీలో ఉచితంగా బీటెక్ కోర్స్ చేసి జాబ్ పొందండి. ఇందుకోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన విడుదలైంది.

ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ ఆర్మీలో ఫ్రీగా BTech, ఆపై ఉద్యోగం కూడా!

టెక్నికల్ ఎడ్యుకేషన్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలా మంది యూత్ బీటెక్ చేయాలని కలలు కంటుంటారు. సాఫ్ట్ వేర్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలని గోల్ పెట్టుకుంటారు. లక్షల ప్యాకేజీలతో జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే బీటెక్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ రోజుల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలి అనే పరిస్థితి దాపరించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అందరికీ బీటెక్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. బీటెక్ చేయాలనే వారి కల డబ్బు లేని కారణంగా కలగానే మిగిలిపోతుంది. ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ పేదరికం కారణంగా చదువకు దూరమవుతున్నారు. అయితే ఇలాంటి వారు ఉచితంగా బీటెక్ చేసే సౌకర్యం ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు.

ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ ఫ్రీగా ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసే ఛాన్స్ కల్పిస్తోంది. బీటెక్/బీఈ కోర్సులను పూర్తి ఉచితంగానే కంప్లీట్ చేయొచ్చు. ఇంటర్ పాసైతే చాలు ఇండియన్ ఆర్మీలో ఫ్రీగా ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయొచ్చు. అంతే కాదు ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆర్మీలో ఉద్యోగం కూడా పొందొచ్చు. ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇందుకోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన విడుదలైంది. ఇండియన్ ఆర్మీ జులై 2025లో ప్రారంభమయ్యే 53వ ’10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్)’ కోర్సు శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులో ప్రవేశాలకు అర్హులు.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2024లో పాసైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు 16½ -19½ సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ ఐదేళ్లు ఉంటుంది.

ఇందులో ఏడాది పాటు బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్, నాలుగేళ్లు టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజనీరింగ్‌(బీఈ/బీటెక్‌) డిగ్రీ అందజేస్తారు. 2025 జులై నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. సక్సెస్ ఫుల్ గా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్‌ పట్టాతో పాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం ఇస్తారు. విధుల్లో చేరినవారికి లెవెల్‌-10 ప్రకారం నెలకు 1 లక్ష రూపాయల వరకూ జీతం ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 6వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని కోరింది. పూర్తి సమాచారం కోసం joinindianarmy.nic.in ను సందర్శించి తెలుసుకోవచ్చు.