iDreamPost
android-app
ios-app

తన కుటుంబాన్ని వదిలెళ్లినా.. ఎన్నో కుటుంబాలను కాపాడారు.. ఆర్మీ కెప్టెన్ భార్య ఎమోషనల్

  • Published Jul 07, 2024 | 3:00 AM Updated Updated Jul 07, 2024 | 3:00 AM

Captain Anshuman Singh Wife Smriti Singh: దేహం ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యమంటారు. ఇతర కుటుంబాలు ప్రమాదంలో ఉంటే తన కుటుంబం గుర్తుకురాదు. అదే ఆర్మీలో పని చేసే జవాన్ కి ఉన్న గొప్ప లక్షణం. చావు వస్తుందని తెలిసి మరీ వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెళ్లిన వాళ్ళలో కొంతమంది ఎప్పటికీ తిరిగిరారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారికి మరణానంతరం అవార్డులతో గౌరవిస్తారు. ఈ క్రమంలో కెప్టెన్ అన్షుమన్ సింగ్ కి కీర్తి చక్ర అవార్డుని ప్రకటించగా.. దాన్ని ఆయన సతీమణి స్మృతి సింగ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

Captain Anshuman Singh Wife Smriti Singh: దేహం ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యమంటారు. ఇతర కుటుంబాలు ప్రమాదంలో ఉంటే తన కుటుంబం గుర్తుకురాదు. అదే ఆర్మీలో పని చేసే జవాన్ కి ఉన్న గొప్ప లక్షణం. చావు వస్తుందని తెలిసి మరీ వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెళ్లిన వాళ్ళలో కొంతమంది ఎప్పటికీ తిరిగిరారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారికి మరణానంతరం అవార్డులతో గౌరవిస్తారు. ఈ క్రమంలో కెప్టెన్ అన్షుమన్ సింగ్ కి కీర్తి చక్ర అవార్డుని ప్రకటించగా.. దాన్ని ఆయన సతీమణి స్మృతి సింగ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

తన కుటుంబాన్ని వదిలెళ్లినా.. ఎన్నో కుటుంబాలను కాపాడారు.. ఆర్మీ కెప్టెన్ భార్య ఎమోషనల్

తమ కంటే, తమ కుటుంబం కంటే దేశమే ముఖ్యమని చెప్పి దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని అరుదైన వృత్తి దేశ రక్షణ. ఎప్పుడైతే ఆర్మీలో జాయిన్ అయ్యారో అప్పుడే ఆ క్షణమే.. ఈ ప్రాణం ఈ దేశానిది.. ఈ ప్రాణం ఈ మట్టి కోసం.. ఈ ఆయువు దేశ రక్షణ కోసం అని ఫిక్స్ అయిపోతారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు గౌరవంగా భారత ప్రభుత్వం అవార్డులు ప్రధానం చేస్తుంటుంది. ఈ క్రమంలో దేశ రక్షణలో తెగువ చూపిన సైనికులకు, పారామిలిటరీ సిబ్బందికి శుక్రవారం నాడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను అందించారు. వీరిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన కెప్టెన్ అంశుమన్ సింగ్ కి ఆయన మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డుని ఆయన భార్య స్మృతి సింగ్, ఆయన తల్లి అందుకున్నారు.

ఈ క్రమంలో ఆమె అంశుమన్ సింగ్ ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. అంశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి చెబుతుండగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. కాలేజీ చదువుతున్న రోజుల్లో తొలిసారిగా కలిశామని స్మృతి సింగ్ వెల్లడించారు. ఆ పరిచయం ప్రేమగా మారిందని.. ఆ తర్వాత అంశుమన్ సింగ్ ఆర్మీ మెడికల్ కాలేజీలో చేరారని అన్నారు. 8 ఏళ్ల పాటు ఇద్దరం ప్రేమించుకున్నామని అన్నారు. 2023లో ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నామని.. అయితే పెళ్ళైన 2 నెలలకే అంశుమన్ సింగ్ కి సియాచిన్ లో పోస్టింగ్ వచ్చిందని అన్నారు. సొంత ఇల్లు, పిల్లలు, ఫ్యూచర్ ఇలా రాబోయే 50 ఏళ్ళు ఎలా ఉండాలో తమ జీవితాన్ని ఊహించుకున్నామని.. జీవితాన్ని అందంగా మలచుకోవాలని ఎన్నో కలలు కన్నామని స్మృతి సింగ్ అన్నారు.

చివరిసారిగా ఇద్దరం 2023 జూలై 18న ఫోన్ లో మాట్లాడుకున్నామని.. ఆ తర్వాత రోజు కెప్టెన్ అంశుమన్ సింగ్ లేరని తెలిసిందని అన్నారు. ఇది జరిగి ఏడాది అవుతున్నా గానీ ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం అంశుమన్ సింగ్ కీర్తి చక్ర అవార్డు తన చేతిలో ఉందని.. ఇక తను రాడు అనేది నిజమేమో అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భర్త ఒక రియల్ హీరో అని.. తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినా ఎన్నో కుటుంబాలని రక్షించి హీరో అయ్యారని ఆమె అన్నారు.

పంజాబ్ రెజిమెంట్ లోని 26వ బెటాలియన్ కి చెందిన కెప్టెన్ అంశుమన్ సింగ్.. ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్ గా సేవలు అందించేవారు. అయితే సియాచిన్ బేస్ క్యాంప్ లో గత ఏడాది జూలై 19న జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న జవాన్లను కాపాడేందుకు కెప్టెన్ అంశుమన్ సింగ్ రంగంలోకి దిగారు. అందరినీ కాపాడి బయటకు తీసుకొచ్చారు. మెడికల్ ఇన్వెస్టిగేషన్ రూమ్ కి మంటలు వ్యాపిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లడంతో ఆ మంటలు అంశుమన్ సింగ్ కి అంటుకున్నాయి. దీంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ అమరుడయ్యారు. దీంతో ఆయన ప్రదర్శించిన తెగువకు ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డుని ప్రకటించింది.