P Venkatesh
మీరు ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇ:డియన్ ఆర్మీలో ఉచితంగానే ఇంజనీరింగ్ చదివే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.
మీరు ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇ:డియన్ ఆర్మీలో ఉచితంగానే ఇంజనీరింగ్ చదివే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ పాసైన విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తు కోసం ఏ కోర్సులు చదివితే బెటర్ అని ఆలోచిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలంటే అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటని ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇంటర్ పాసైతే చాలు ఇండియన్ ఆర్మీలో ఫ్రీగా ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయొచ్చు. బీటెక్/బీఈ కోర్సులను పూర్తి ఉచితంగానే కంప్లీట్ చేయొచ్చు. అంతే కాదు ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆర్మీలో ఉద్యోగం కూడా పొందొచ్చు. ఆర్మీలో చేరాలని కలలుకనే వారికి ఇదే మంచి అవకాశం.
ఇండియన్ ఆర్మీ జనవరి 2025లో ప్రారంభమయ్యే 52వ ’10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్)’ కోర్సు శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2024లో పాసైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులో ప్రవేశాలకు అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. మే 13నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.