iDreamPost
android-app
ios-app

కన్నీళ్లు పెట్టిస్తున్న జవాన్ తల్లి ప్రశ్న.. ఇంక నా బిడ్డ ఇంటికి రాడుగా!

Captain Brijesh Thapa Mother Emotional Comments: జమ్మూకశ్మీర్ డోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో కెప్టెన్ బ్రిజేష్ థాపా అమరుడయ్యాడు. అతని తల్లి చేసిన వ్యాఖ్యలు అందరినీ కలచి వేస్తున్నాయి. తన కొడుకు ఇంక తిరిగి ఇంటికి రాడుగా అంటూ ఆమె అంటుంటే అందరి హృదయాలు మెలిపెట్టినట్లు అయ్యింది.

Captain Brijesh Thapa Mother Emotional Comments: జమ్మూకశ్మీర్ డోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో కెప్టెన్ బ్రిజేష్ థాపా అమరుడయ్యాడు. అతని తల్లి చేసిన వ్యాఖ్యలు అందరినీ కలచి వేస్తున్నాయి. తన కొడుకు ఇంక తిరిగి ఇంటికి రాడుగా అంటూ ఆమె అంటుంటే అందరి హృదయాలు మెలిపెట్టినట్లు అయ్యింది.

కన్నీళ్లు పెట్టిస్తున్న జవాన్ తల్లి ప్రశ్న.. ఇంక నా బిడ్డ ఇంటికి రాడుగా!

ప్రతి తల్లి తన కొడుకు ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. ఏ తల్లైనా తన కొడుకు తన కళ్ల ముందు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి అని కలలు కంటుంది. ఈ తల్లి కూడా అలాగే కోరుకుంది. తన కుమారుడు తనతోనే ఉండాలి అనుకుంది. కానీ, ఆ కొడుకు మాత్రం తండ్రి బాటలో ఆర్మీలో చేరాడు. దేశానికి సేవ చేయడమే తన లక్ష్యం అంటూ సరిహద్దులకు వెళ్లాడు. ఇప్పుడు అతను అమరుడు అయ్యాడు. సోమవారం జుమ్మూకశ్మీర్ డోడా జిల్లాలో ముష్కురులు- ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో కెప్టెన్ బ్రిజేష్ థాపా అమరుడు అయ్యాడు. ఆ వార్త విని తల్లి గుండె పగిలిపోయింది. తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అనే సంతృప్తి తప్ప.. తమకు ఎలాంటి సంతోషం మిగల లేదు. తన కొడుకు ఇంక తిరిగి ఇంటికి రాడు కదా అని ఆ తల్లి అడిగిన ప్రశ్న అక్కడున్న వారి కళ్లల్లో నీళ్లు తిరిగేలా చేసింది.

ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రం పెద్దఎత్తున కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇండియన్ ఆర్మీ ఎంతో కష్టపడుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్ డోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ రాజేశ్, సిపాయి బ్రిజేంద్ర, అయజ్ లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి తమ పుత్రుడు ఇంక ఇంటికి రాడని కెప్టెన్ బ్రిజేష్ థాపా తల్లి కన్నీరు మున్నీరు అయ్యారు. తన కుమారుడి మరణానికి కారణమైన ఉగ్రవాదులను విడిచిపెట్టొద్దంటూ ఆమె కోరారు. తమకు పుత్ర శోఖాన్ని మిగిల్చిన ఆ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. జవాన్ల మరణంపై రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. వారి మరణాలు వృథా పోవని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బ్రిజేశ్ తండ్రి కూడా ఆర్మీలో దేశానికి సేవ చేసిన వ్యక్తే. ఆయన కల్నల్ హోదాలో రిటైర్ అయ్యారు. అయితే చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన బ్రిజేష్ కూడా ఆర్మీలో చేరాలి అని కలలు కన్నాడు. అనుకున్నది తడవుగా అన్నీ టెస్టులు పాసై.. ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ఐదేళ్లుగా ఆర్మీలో ఉన్న బ్రిజేష్ థాపా అమరుడయ్యాడు. అయితే ఇంకా బ్రిజేష్ కు వివాహం జరగలేదు. అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని కుటుంబం ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. కొన్నాళ్లుగా బ్రిజేష్ కోసం అమ్మాయిని వెతికే పనిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఆ తల్లి కష్టం చూసి అక్కడున్న వాళ్లంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఆమె అన్న మాటలకు అందరి కళ్లు చెమ్మగిల్లాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి