P Venkatesh
భారత సైన్యంలో చేరడమే మీ లక్ష్యమా.. ఇండియన్ ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్. హైదరాబాద్ లో భారీ ఆర్మీ రిక్రూట్ మెట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
భారత సైన్యంలో చేరడమే మీ లక్ష్యమా.. ఇండియన్ ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్. హైదరాబాద్ లో భారీ ఆర్మీ రిక్రూట్ మెట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
P Venkatesh
దేశానికి సేవ చేసే అదృష్టం అందరికి రాదు. భరత భూమి సేవలో పాలుపంచుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం. దేశ రక్షణలో బాగమయ్యేందుకు ఇండియన్ ఆర్మీలో చేరి తమ వంతు కృషి చేయాలని యువత కలలు కంటుంటారు. దేశ సంపదను, పౌరుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర వహిస్తారు సైనికులు. ఎప్పుడు ఏ వైపు నుంచి ముష్కరులు దాడిచేస్తారో తెలియని పరిస్థతి. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలకు తెగించి పోరాడి దుండగులను మట్టుబెడతారు. ఈ క్రమంలో ఆర్మీలో చేరాలను కునే వారికి ఇండియన్ ఆర్మీ శుభవార్తను అందించింది. హైదరాబాద్ లో భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సైన్యంలో చేరాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లోని ఏఓసీ సెంటర్ థాపర్ స్టేడియంలో అగ్ని వీరుల భర్తీ కోసం ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్, అగ్నివీర్ అడ్మిన్ అసిస్టెంట్ / స్టోర్ కీపర్ ఎన్ రోల్ మెంట్ కోసం యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ 2024 జనవరి 1 నుంచి మార్చి 10 వరకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో నిర్వహించనున్నారు.
బెస్ట్ స్పోర్ట్స్ మెన్ ( ఓపెన్ కేటగిరీ) అభ్యర్థులు స్పోర్ట్స్ ట్రయల్ కోసం 2023 డిసెంబర్ 29 ఉదయం 6 గంటలకు ఏఓసీ సెంటర్ లోని థాపర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అగ్నివీర్ టెక్ కోసం అభ్యర్థులు సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్) లో 10+2 లేదా ఇంటర్మీడియట్ పరీక్సలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండలి. ఆసక్తి గల అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ర్యాలీ గురించి మరింత సమాచారం కోసం www.joindianarmy.nic.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. లేదా ఈస్ట్ మారేడ్ పల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్ లో సంప్రదించొచ్చు.