iDreamPost
android-app
ios-app

స్పోర్ట్స్ బాగా ఆడేవారికి లక్కీ ఛాన్స్.. ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. మిస్ చేసుకోకండి

Indian Army Direct Entry Havildar and Naib Subedar (Sports) 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు స్పోర్స్ట్ బాగా ఆడి పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు ఇండియన్ ఆర్మీలో జాబ్ పొందొచ్చు.

Indian Army Direct Entry Havildar and Naib Subedar (Sports) 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు స్పోర్స్ట్ బాగా ఆడి పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు ఇండియన్ ఆర్మీలో జాబ్ పొందొచ్చు.

స్పోర్ట్స్ బాగా ఆడేవారికి లక్కీ ఛాన్స్.. ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. మిస్ చేసుకోకండి

ఇండియన్ ఆర్మీలో చేరాలని యూత్ కలలుకంటుంటారు. ఆర్మీలో చేరితే మంచి జీతంతో పాటు దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడిపోవచ్చు. అందుకే యువతీ, యువకులు ఆర్మీలో జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా ఆర్మీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? మీరు స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది మిస్ చేసుకోకండి. మీరు టెన్త్ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.

ఇండియన్ ఆర్మీ అవివాహిత పురుష, మహిళ నుంచి స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇండియన్ ఆర్మీ క్రీడా కోటా ఎంట్రీ కింద డైరెక్ట్ ఎంట్రీ(ఇంటేక్ 02/2024) ద్వారా హవిల్దార్, నాయబ్ సుబేదార్(స్పోర్ట్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాక్సింగ్, డైవింగ్, ఫుట్ బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్ బాల్, కబడ్డీ క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • హవల్దార్, నాయబ్ సుబేదార్ (స్పోర్ట్స్) ఇంటేక్ 02/2024

క్రీడా విభాగాలు:

  • అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాక్సింగ్, డైవింగ్, ఫుట్ బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్ బాల్, కబడ్డీ.

అర్హత:

  • పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం. అంతర్జాతీయ/ జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్/ ఖేలో ఇండియా గేమ్స్/ యూత్ గేమ్స్ లో పాల్గొన్న అత్యత్తమ క్రీడాకారులై ఉండాలి.

వయోపరిమితి:

  • 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్టు, స్కిల్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ పీటీ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్టాఫ్ బ్రాంచ్, ఐహెచ్ క్యూ(ఆర్మీ), రూమ్ నెం. 747, ఎ వింగ్, సేనా భవన్, న్యూఢిల్లీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ:

  • 30-09-2024