iDreamPost
android-app
ios-app

కోడలు మాతో ఉండటం లేదు.. కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పేరెంట్స్ ఆవేదన

గత ఏడాది జులైలో సియాచిన్‌లో జరిగిన అగ్ని పమ్రాదంలో తోటి సైనికులను, వైద్య పరీకరాలను కాపాడుతూ మరణించాడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్. అతడి సాహసాన్ని గుర్తించి భార్య, తల్లికి కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే..

గత ఏడాది జులైలో సియాచిన్‌లో జరిగిన అగ్ని పమ్రాదంలో తోటి సైనికులను, వైద్య పరీకరాలను కాపాడుతూ మరణించాడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్. అతడి సాహసాన్ని గుర్తించి భార్య, తల్లికి కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే..

కోడలు మాతో ఉండటం లేదు.. కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పేరెంట్స్ ఆవేదన

ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సేవ చేస్తుంటారు జవాన్లు. తల్లిదండ్రులు, భార్య, బిడ్డల్ని వదిలేసి.. సరిహద్దుల్లో పహారా కాస్తుంటారు. ప్రజా రక్షణకు పాటుపడుతుంటారు. అలా ఆపత్కాలంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్లకు పరమ వీర చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర వంటి అవార్డులను బాధిత కుటుంబాలకు అందిస్తోంది కేంద్ర  ప్రభుత్వం. తాజా కెప్టెన్ అన్షుమాన్ సింగ్ మరణించగా.. ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి మంజు సింగ్ కీర్తి చక్రను అందించింది. స్మృతితో పెళ్లైన మూడు నెలలకే ఓ అగ్ని ప్రమాదంలో మరణించాడు కెప్టెన్ అన్షుమాన్. గత ఏడాది జులైలో సియాచిన్‌లో జరిగిన క్యాంప్ బేస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో తోటి సైనికులను, వైద్య పరీకరాలను కాపాడుతూ మరణించాడు అన్షుమాన్ సింగ్.

అతడి సాహసాన్ని గుర్తించి దేశంలోనే రెండవ అత్యున్న శౌర్య పురస్కారం కీర్తి చక్రను అతడి కుటుంబానికి అందించింది కేంద్ర ప్రభుత్వం. భార్య స్మృతి, తల్లి మంజు సింగ్ ఈ అవార్డను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. ఆ సమయంలో కాస్తంత భావోద్వేగానికి లోనైంది అతడి కుటుంబం. అలాగే అన్షుమాన్ భార్య స్మృతిపై సోషల్ మీడియా వేదికగా కొంత మంది పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు.

Anshuman singh

బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అదే జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవితభాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ఈ నిబంధనలనే మార్చాలని కెప్టెన్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కెప్టెన్ తల్లిదండ్రలు ఏమంటున్నారంటే.. ‘కొడుకు పోయిన తర్వాత NOK కింద కోడలికి బెనిఫిట్స్ అందాయి. పెళ్లయ్యి ఐదు నెలలే అయ్యింది. ఆమెకు సంతానం కూడా లేరు. ఇప్పుడు మాతో ఉండటం లేదు. మేము కీర్తి చక్ర గ్రహీత అయినప్పటికీ..మా కొడుకు ఫోటో గోడకు వేలాడదీసి.. పూల మాలలు వేసుకుని స్మరించుకుంటున్నాం తప్పితే..మాకు ఏం మిగల్లేదు. NOKకి సెట్ చేసిన ప్రమాణాలు సరైనవి కావు. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కూడా మాట్లాడాము’ అని తెలిపారు.