iDreamPost
android-app
ios-app

వయనాడ్‌లో ఇండియన్ ఆర్మీకి వీడ్కోలు.. ఎమోషనల్ వీడియో వైరల్!

  • Published Aug 09, 2024 | 3:32 PM Updated Updated Aug 09, 2024 | 3:32 PM

Emotional Farewell to The Indian Army: ఇటీవల కేరళా రాష్ట్రంలోని అందమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు కలిగిన వయనాడ్ జిల్లాలో ప్రకృతి విళయం సృష్టించింది. ఈ విపత్తులో భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 417 పైగా మృత్యువాత పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Emotional Farewell to The Indian Army: ఇటీవల కేరళా రాష్ట్రంలోని అందమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు కలిగిన వయనాడ్ జిల్లాలో ప్రకృతి విళయం సృష్టించింది. ఈ విపత్తులో భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 417 పైగా మృత్యువాత పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

వయనాడ్‌లో ఇండియన్ ఆర్మీకి వీడ్కోలు.. ఎమోషనల్ వీడియో వైరల్!

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.కేరళాలో నెల రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండిపోయాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.వయనాడ్ జిల్లాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.. ఎక్కడ చూసినా బురదమయం. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలు, భారత సైన్యంతో సహా రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి నిస్వార్థ సేవలు అందించాయి. పది రోజుల పాటు నిరంతర సేవలు అందించిన ఆర్మీ వయనాడ్ నుంచి బయలుదేరింది. తాజాగా  సైన్యానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందలమంది మృత్యువాత పడ్డారు. ఎంతోమంది గల్లంతయ్యారు.. వారి కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పదివేల మంది నిరాశ్రయులు వివిధ పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్నారు. వయనాడ్ జిల్లాలో సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గాలింపు కార్యక్రమాల్లో ఆర్మీ, రెస్క్యూ టీమ్ తో పాటు 1200 మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. వయనాడ్ ఘటనలో భారత సైన్యం ఎంతో దైర్యసాహసాలు ప్రదర్శించింది. నిస్వార్థ సేవలు అందించి అనేకమంది ప్రాణాలు కాపాడారు. ఆర్మీ 10 రోజుల రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి చేసింది.

భారత సైన్యం 10 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తి చేసి బయలు దేరింది. ఆర్మీ బాధ్యతలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది తో పాటు కేరళా పోలీసులకు అప్పగించనున్నారు. భారత సైన్యం తాత్కాలికంగా నిర్మించిన బెయిలీ వంతెన నిర్వహణ బృందం ఈ ప్రాంతంలోనే ఉంటుంది.  ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్మీ జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు అక్కడ ప్రజలు. వయనాడ్ ని విడిచి వెళ్తున్న భారత సైన్యానికి స్థానికులు భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.