iDreamPost
android-app
ios-app

Indian Army: చైనాను ఓడించిన భారత సైన్యం.. వీడియో వైరల్‌

  • Published May 29, 2024 | 2:59 PM Updated Updated May 29, 2024 | 3:05 PM

భారత సైన్యం చేతిలో చైనా ఆర్మీ చిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

భారత సైన్యం చేతిలో చైనా ఆర్మీ చిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

  • Published May 29, 2024 | 2:59 PMUpdated May 29, 2024 | 3:05 PM
Indian Army: చైనాను ఓడించిన భారత సైన్యం.. వీడియో వైరల్‌

సరిహద్దు దేశాల మధ్య పోరు అంటే రసవత్తరంగానే ఉంటుంది. ఇక భారత్‌-చైనా, భారత్‌-పాక్‌ సైన్యం మధ్య పోరు అంటే ఇరు దేశాల ప్రజలు ఆసక్తి చూపుతారు. ఆఖరికి వారి మధ్య నిర్వహించే ఆటల్లో సైతం ఇదే వైఖరిని ఫాలో అవుతుంటారు. ఇక ఇండియా, పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ అంటే.. ఇరు దేశాల వాళ్లు చిన్న పాటి యుద్ధంగానే ఫీలవుతారు. ఈమ్యాచ్‌ రోజు ఇరు దేశాల ప్రజల్లో నరాలు తెగె ఉత్కంఠత ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో మన సైన్యం చేతిలో చైనా ఆర్మీ.. చిత్తుగా ఓడిపోయింది. దాంతో మన వాళ్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఆవివరాలు..

భారత్, చైనా సైనికుల పోరు అంటేనే అందరిలో అమితాసక్తి. ఇక, ఇరు దేశాల మధ్య క్రీడలకు సంబంధించిన ఏదైనా పోటీ నిర్వహిస్తే.. ఇక అప్పుడు ఉండే జోష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్‌ పోటీ సందర్భంగా ఇదే సీన్‌ కనిపించింది. ఈ గేమ్‌లో సీపీఎల్ఏ సైనికులను ఇండియన్ ఆర్మీ సైనికులు చిత్తుగా ఓడించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్‌లో భాగంగా ఆఫ్రికాలోని సూడాన్‌లో భారత్, చైనా సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య టగ్ ఆఫ్ వార్ గేమ్ నిర్వహించారు. ఇందులో చైనాపై భారత్ సైనికులు విజయం సాధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. అయితే ఇది కేవలం సరదాగా నిర్వహించిన ఆట మాత్రమే అంటున్నారు.

మే 28 అనగా మంగళవారం నాడు ఇరు దేశాల మధ్య ఈ టగ్‌ ఆఫ్‌ వార్‌ గేమ్‌ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ పోటీలో విజయం సాధించిన భారత సైనికులు సంబరాలు చేసుకోవడం వీడియో క్లియర్‌గా కనిపిస్తోంది. టగ్‌ ఆఫ్‌ వార్‌ అంటే తాడు లాగడమే. తాడు లాగుతున్న భారత్, చైనా సైనికులను ఇరు దేశాలకు చెందిన మద్దతుదారులు ఉత్సాహపరుస్తుండటం వీడియోలో చూడొచ్చు. భారత సైనికులు బలం ముందు చైనా సైనికులు నిలబడలేక.. ముందుకు తూలి పడ్డారు. ఇక భారత సైన్యం విజయం సాధించడంతో నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆటైనా.. యుద్ధమైనా.. మా ముందు మీరు నిలబడలేరు.. ఇది మరోసారి నిరూపణ అయ్యింది. జై ఇండియన్‌ ఆర్మీ.. అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోని మీరు చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.