iDreamPost
android-app
ios-app

ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? రక్షణ రంగంలో చేరేందుకు గోల్డెన్ ఛాన్స్..

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి గుడ్ న్యూస్. భారత రక్షణ రంగంలో చేరే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఉచితంగా డిగ్రీ విద్యతో పాటు త్రివిధ దళాల్లో ఉన్నతమైన ఉద్యోగాలను పొందొచ్చు.

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి గుడ్ న్యూస్. భారత రక్షణ రంగంలో చేరే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఉచితంగా డిగ్రీ విద్యతో పాటు త్రివిధ దళాల్లో ఉన్నతమైన ఉద్యోగాలను పొందొచ్చు.

ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? రక్షణ రంగంలో చేరేందుకు గోల్డెన్ ఛాన్స్..

గత నెలలో ఇంటర్మిడియట్ కు సంబంధించిన పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇంటర్ లో ఉత్తీర్ణులైన స్టూడెంట్స్ తమ ఫ్యూచ్ బాగుండాలంటే ఏకోర్సులు చేస్తే మేలని ఆరా తీస్తున్నారు. త్వరగా ఉద్యోగా ఉపాధి అవకాశాలు పొందేందుకు అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. మీరు ఇంటర్ పాసైతే చాలు భారత రక్షణ రంగంలో కెరియర్ ను ప్రారంభించొచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమి, నేవల్ అకాడమీ పరీక్ష ద్వారా మీరు ఉచితంగా డిగ్రీ విద్యను పొంది, ఆ తర్వాత రక్షణ రంగంలో ఉద్యోగం కూడా పొందొచ్చు. త్రవిధ దళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించొచ్చు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (II)- 2024 నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ పరీక్ష ద్వారా భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో దాదాపు 404 ఖాళీలను భర్తీచేయనున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2025, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జులై 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే 154వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 116వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (2)-2024

ఖాళీల సంఖ్య:

  • 404

విభాగాల వారీగా ఖాళీలు:

నేషనల్ డిఫెన్స్ అకాడమీ:

  • 370 పోస్టులు (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120).
  • నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్):
  • 34

అర్హత:

  • ఆర్మీ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 02.01.2006 – 01.01.2009 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ఫీజు:

  • రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు.

ఎంపిక విధానం:

  • అభ్యర్థులకు రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.

కోర్సులు:

  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికచేయబడతారు. ఎంపికైనవారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉచితంగానే మీరు ఈ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉద్యోగాలను పొందొచ్చు.

శిక్షణ:

  • అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 15-05-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 04-06-2024.