ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియను సిద్ధం చేసింది. కరోనా కారణం ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఏపీపీఎస్సి నిర్వహించాల్సిన అనేక ఉద్యోగ నియామక పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. తాజాగా పరీక్షల తేదీల వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 13 వరకూ వివిధ తేదీలలో ఏపీపీఎస్సి ప్రకటించిన ఉద్యోగ నియామక పరీక్షలు జరగనున్నాయి. ఏపీపీఎస్సి విడుదల చేసిన పరీక్షల తేదీల వివరాలు: […]
ఆంధ్రప్రదేశ్లో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులకు ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణ పురపాలక శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం 19 రకాల పోస్టులకు 11.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష మార్చి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించాలని అప్పట్లో భావించగా.. కరోనా కారణంగా జరగలేదు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ ఎత్తివేత కొనసాగుతుండగా.. […]
రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ నిమ్మగడ్డ లేఖ వ్యవహారం ఇంకా చల్లబడకుండానే ప్రభుత్వం పై ఫిర్యాధు చేస్తు మరో అధికారి గవర్నర్ ను కలిసారని ఆంధ్రజ్యోతి పత్రిక లో ఒక కధనం ప్రచురితం అయింది . ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కధనం ప్రకారం, ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారని గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూ మూడుపేజీల లేఖను గవర్నర్ […]
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని నియంత్రించేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేసిందా.. దానికి అనుగుణంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోందా.. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు సమాయత్తం అవుతోందా..ఏక వ్యక్తి కమిషన్ కాకుండా ముగ్గరు సభ్యులను నియమించాలని ఆలోచిస్తోందా..అంటే అవుననే సమాధానం వస్తోంది టీడీపీ అనుకూల మీడియా నుంచి. ఎస్ ఈ సీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా మారిన వ్యవహారంలో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి ఆ వర్గపు మీడియాలోనే ఎక్కువ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో […]
అన్ని లోపాలను సవరించి, పూర్తి పారదర్శకంగా పనిచేసేలా ఏపీపీఎస్సీని తీర్చిదిద్దాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి సంస్థల సహకారంతో సమూల సంస్కరణల దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగులు వేస్తోంది. కమిషన్ బుధవారం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్ జింకా రంగ జనార్దన, సభ్యులు కె.విజయకుమార్, ప్రొఫెసర్ గుర్రం సుజాత, ప్రొఫెసర్ కె.పద్మరాజు, సేవారూప, […]