P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ పలు శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ పలు శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు.
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1, మెగా డీఎస్సీకి నోటిఫికేషన్లు రిలీజ్ కాగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ క్రమంలో పలు శాఖల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, స్టాటస్టికల్ ఆఫీసర్లు, ఫిషరిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతి ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం 49 పోస్టులు కాగా.. వాటిలో 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులు, 5 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు, 4 ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టులు, 3 ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టుల పూర్తి సమాచారం కోసం https://psc.ap.gov.in/ క్లిక్ చేయండి. స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల వివరాల కోసం https://psc.ap.gov.in/, ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టుల సమాచారం కోసం https://psc.ap.gov.in/,అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల వివరాల కోసం https://psc.ap.gov.in/ ఈ లింక్ పై క్లిక్ చేయండి.