iDreamPost
android-app
ios-app

Group-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మెయిన్స్ కు ఎంతమంది అర్హత సాధించారంటే?

  • Published Apr 13, 2024 | 7:38 AM Updated Updated Apr 13, 2024 | 7:38 AM

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్ష రాసిన వారిలో మొత్తం ఎంత మంది మెయిన్స్ కు అర్హత సాధించారంటే?

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్ష రాసిన వారిలో మొత్తం ఎంత మంది మెయిన్స్ కు అర్హత సాధించారంటే?

  • Published Apr 13, 2024 | 7:38 AMUpdated Apr 13, 2024 | 7:38 AM
Group-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మెయిన్స్ కు ఎంతమంది అర్హత సాధించారంటే?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 08న గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి గత నెల మార్చి 27న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన ఏపీపీఎస్సీ తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది.

ఏపీలో గ్రూప్ 1 ఉద్యోగాలకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు అప్లై చేసుకున్నారు. కాగా ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారిలో 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 02, 09 తేదీల మధ్య మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రెస్‌ నోట్‌లో ఏపీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

పోస్టుల వివరాలు:

ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18, డీఎస్పీ (సివిల్‌) 26, డిప్యూటీ సూపరింటెండ్ ఆప్ జైల్ సర్వీస్ 01, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 01, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 01, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 03, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ -II 01, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 01, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4, , అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2 పోస్టులు ఉన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet