iDreamPost
android-app
ios-app

AP సర్కార్ మరో గుడ్ న్యూస్.. లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

  • Published Jan 01, 2024 | 2:32 PM Updated Updated Jan 01, 2024 | 2:45 PM

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 287 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది.

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 287 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది.

  • Published Jan 01, 2024 | 2:32 PMUpdated Jan 01, 2024 | 2:45 PM
AP సర్కార్ మరో గుడ్ న్యూస్.. లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. వందల సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ విడుదలవుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 , పాలిటెక్నిక్ లెక్చరర్, డీఈవో, ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా వాటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ, డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్హత, వయసు, వేతనం తదితర వివరాలతో పూర్తిస్థాయి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభ సమయానికి అందుబాటులోకి రానుంది. ఈ పోస్టుల భర్తీకి జనవరి 24 నుంచి ఆన్‌ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://appsc.aptonline.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • డిగ్రీ లెక్చరర్ పోస్టులు
  • మొత్తం ఉద్యోగాలు:
  • 240

విభాగాల వారీగా ఖాళీలు:

  • బోటనీ 19 పోస్టులు, కెమిస్ట్రీ 26 పోస్టులు, కామర్స్ 35 పోస్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్ 26 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 31 పోస్టులు, ఎకనామిక్స్ 16 పోస్టులు, హిస్టరీ 19 పోస్టులు, మ్యాథమెటిక్స్ 17 పోస్టులు, ఫిజిక్స్ 11 పోస్టులు, పొలిటికల్ సైన్స్ 21 పోస్టులు, జువాలజీ 19 పోస్టులు

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 24-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 13-02-2024.

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్:

ఏపీలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల (జేఎల్) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఈ పోస్టులకు జనవరి 31 2024 నుంచి ఫిబ్రవరి 20 2024వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత, వయసు, వేతనం తదితర వివరాలతో పూర్తిస్థాయి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభ సమయానికి అందుబాటులోకి రానుంది.

ముఖ్యమైన సమాచారం:

  • జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు
  • మొత్తం ఉద్యోగాలు:
  • 47

సబ్జెక్టులవారీగా ఖాళీలు..

  • ఇంగ్లిష్: 09
  • తెలుగు: 02
  • ఉర్దూ: 02
  • సంస్కృతం: 02
  • ఒరియా: 01
  • మ్యాథమెటిక్స్: 01
  • ఫిజిక్స్: 05
  • కెమిస్ట్రీ: 03
  • బోటనీ: 02
  • జువాలజీ: 01
  • ఎకనామిక్స్: 12
  • సివిక్స్: 02
  • హిస్టరీ: 05

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 31-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 20-02-2024.

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్:

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş