iDreamPost
android-app
ios-app

APలోని ఆ శాఖలో ఉద్యోగాలు! తక్కువ మందితో పోటీ! నెలకు రూ.1,30,580 జీతం!

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ఏపీలోని ఆ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎంపికైతే నెలకు రూ. 1,30,580 జీతం అందుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ఏపీలోని ఆ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎంపికైతే నెలకు రూ. 1,30,580 జీతం అందుకోవచ్చు.

APలోని ఆ శాఖలో ఉద్యోగాలు! తక్కువ మందితో పోటీ!  నెలకు రూ.1,30,580 జీతం!

నేటి యువత కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదువు పూర్తైన తర్వాత బిజినెస్ చేయాలా లేదా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేయడం మేలా అని ఆలోచిస్తున్నారు. బిజినెస్ అయితే కాస్త రిస్క్ తో కూడిన వ్యవహారం. పెట్టుబడి కూడా అవసరం. అదే ప్రైవేట్ ఉద్యోగాలైతే మంచి జీతం అందుకున్నా కూడా పని ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే.. ప్రస్తుత కాలంలో గవర్నమెంట్ జాబ్ పొందాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మొదట్లో తక్కువ జీతాలున్నా కూడా ఆ తర్వాత వచ్చే ఇంక్రిమెంట్లతో కళ్లు చెదిరే జీతం, ఇతర సదుపాయాలు అందుకోవచ్చు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ లో భారీ వేతనంతో ఆ శాఖలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇప్పటికే రాష్ట్రంలో పలు శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఏపీ ఫిషరీస్‌ సర్వీసులో ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఎఫ్‌ఎస్సీ పాసైన వారు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,30,580 జీతం అందుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం :

ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు:

  • 4

అర్హత:

  • అభ్యర్థులు బీఎఫ్‌ఎస్సీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.45,830 – 1,30,580అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

  • కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.370 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.

దరఖాస్తులు ప్రారంభం తేదీ:

  • 23-04-2024

దరఖాస్తులకు చివరితేది:

  • 13-05-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి