iDreamPost
android-app
ios-app

అలర్ట్.. APలో 899 ప్రభుత్వ ఉద్యోగాలు.. రెండ్రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!

  • Published Jan 08, 2024 | 7:52 PM Updated Updated Jan 29, 2024 | 4:46 PM

నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ లో 899 ప్రభుత్వ ఉద్యోగాలకు రెండ్రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. ఇంకా అప్లై చేసుకోని వారు ఉంటే త్వరగా దరఖాస్తు చేసుకోండి.

నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ లో 899 ప్రభుత్వ ఉద్యోగాలకు రెండ్రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. ఇంకా అప్లై చేసుకోని వారు ఉంటే త్వరగా దరఖాస్తు చేసుకోండి.

  • Published Jan 08, 2024 | 7:52 PMUpdated Jan 29, 2024 | 4:46 PM
అలర్ట్.. APలో 899 ప్రభుత్వ ఉద్యోగాలు.. రెండ్రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!

ఆంధ్రప్రదేశ్ లో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. గ్రూప్2, గ్రూప్1 తో పాటు లెక్చరర్ పోస్టులు, ఇంకా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల కాగా వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గత ఏడాది డిసెంబర్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ జాబ్స్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21 2023 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.

ఏపీలో గ్రూప్ 2 ద్వారా 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జనవరి 10 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

  • గ్రూప్-2 పోస్టులు
  • 899

ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

  • 333

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

  • 566

ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు:

  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
  • సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
  • డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
  • ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
  • అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు
  • సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
  • ఆడిటర్: 10 పోస్టులు
  • సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
  • సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
  • సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
  • జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు

అర్హతలు:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఆపై అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 21-12-2023.

దరఖాస్తుకు చివరితేది:

  • 10-01-2024.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom