iDreamPost
android-app
ios-app

డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు.. 1.82 లక్షల వరకు జీతం.. ఇలా అప్లై చేసుకోండి

కొత్త సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని పోస్టులను పెంచింది.

కొత్త సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని పోస్టులను పెంచింది.

డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు.. 1.82 లక్షల వరకు జీతం.. ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. వందల సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ విడుదలవుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 , పాలిటెక్నిక్ లెక్చరర్, డీఈవో, ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా వాటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా అదనంగా మరో 50 పోస్టులను పెంచుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. ఈ పోస్టుల భర్తీకి జనవరి 24 నుంచి ఆన్‌ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://appsc.aptonline.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

డిగ్రీ లెక్చరర్ పోస్టులు

మొత్తం ఉద్యోగాలు:

  • 290

విభాగాల వారీగా ఖాళీలు:

బోటనీ 19 పోస్టులు, కెమిస్ట్రీ 26 పోస్టులు, కామర్స్ 35 పోస్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్ 26 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 31 పోస్టులు, ఎకనామిక్స్ 16 పోస్టులు, హిస్టరీ 19 పోస్టులు, మ్యాథమెటిక్స్ 17 పోస్టులు, ఫిజిక్స్ 11 పోస్టులు, పొలిటికల్ సైన్స్ 21 పోస్టులు, జువాలజీ 19 పోస్టులు

అర్హతలు:

  • సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ లేదా నెట్/స్లెట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.

జీతం:

  • నెలకు రూ..57,700 – రూ.1,82,400 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 24-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 13-02-2024.

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్: