P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్-2 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు చేసింది. ఆ తేదీలోగా ఆప్షన్స్ ను ఎంచుకోవాలని కోరింది. వెబ్ సైట్ ను సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్-2 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు చేసింది. ఆ తేదీలోగా ఆప్షన్స్ ను ఎంచుకోవాలని కోరింది. వెబ్ సైట్ ను సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది.
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది గ్రూప్-2 నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 899 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు 4,83,535 మంది దరఖాస్తుచేసుకున్నారు. అయితే ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలను ఫిబ్రవరి 25న నిర్వహించింది ఏపీపీఎస్సీ. ప్రిలిమ్స్ ఫలితాలను ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో దాదాపు 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. కాగా గ్రూప్ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. ఆ తేదీలోగా ఆప్షన్స్ ఎంచుకోవాలని సూచించింది.
ఏపీలోని గ్రూప్-2 అభ్యర్థులు పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ లో నమోదు చేయాలని కోరింది. ఈ ప్రక్రియ జూన్ 5వ తేదీన ప్రారంభమై.. జూన్ 18వ తేదీతో ముగియనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పరిశీలించి ముందుగానే ఒక పేపర్ పై తమ ప్రాధాన్యాల వివరాలను రాసి సిద్ధంగా ఉంచుకుంటే అప్ లోడ్ చేసే సమయంలో సులువుగా ఉంటుందని సూచిస్తున్నారు. కాగా.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జులై 28వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు.