P Venkatesh
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగార్థులకు భారీగా ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ అదేంటంటే?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగార్థులకు భారీగా ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ అదేంటంటే?
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ జాబ్స్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21 2023 నుంచి ప్రారంభమైంది. నేటితో(జనవరి 10 2024) దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 దరఖాస్తు గడువు తేదీని పొడిగిస్తూ ఓ ప్రకటనను జారీ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 దరఖాస్తు గడువు జనవరి 17వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది.
ఉద్యోగార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలో గ్రూప్ 2 ద్వారా 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జనవరి 17 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://appsc.aptonline.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.