P Venkatesh
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు వేతనం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలక ఏయే అర్హతలు ఉండాలంటే?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు వేతనం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలక ఏయే అర్హతలు ఉండాలంటే?
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవల 6100 పోస్టులతో డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదివరకే గ్రూప్1,గ్రూప్2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లైబ్రేరియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసులో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఏపీపీఎస్సీ.
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.