iDreamPost
android-app
ios-app

గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు

  • Published Dec 29, 2023 | 4:56 PM Updated Updated Dec 29, 2023 | 4:56 PM

మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు మరో గుడ్ న్యూస్. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏఈఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి సమాచారం మీకోసం..

మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు మరో గుడ్ న్యూస్. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏఈఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి సమాచారం మీకోసం..

  • Published Dec 29, 2023 | 4:56 PMUpdated Dec 29, 2023 | 4:56 PM
గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మళ్లీ తీపికబురును అందించింది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు వరుస నోటిఫికేషన్స్ విడుదలవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, పాలిటెక్నిక్ కాలేజీలల్లో లెక్చరర్ పోస్టులు, ఇంకా ఇతర శాఖల్లోని ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్స్ వెలువడిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాలీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 21 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1.47 లక్షల వరకు జీతాన్ని అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 30 2024 నుంచి ఫిబ్రవరి 19 2024 వరకు ఆన్‌ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

  • మొత్తం ఏఈఈ పోస్టులు:
  • 21

అర్హత:

  • అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ (సివిల్/మెకానికల్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.57,100 – రూ.1,47,760 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 30-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 19-02-2024.

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్:

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş