iDreamPost
android-app
ios-app

డిగ్రీ అర్హతతో ఆ శాఖలో ఉద్యోగాలు.. నెలకు 1,37,220 జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. డిగ్రీ అర్హతతో ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,37,220 అందిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. డిగ్రీ అర్హతతో ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,37,220 అందిస్తారు.

డిగ్రీ అర్హతతో ఆ శాఖలో ఉద్యోగాలు.. నెలకు 1,37,220 జీతం

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది యువత. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను నిజం చేసేందుకు రేయింభవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇక నిరుద్యోగులపై దృష్టిపెట్టిన ప్రభుత్వాలు భారీ స్థాయిలో పలు శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్స్, డీఎస్సీ, హెల్త్ డిపార్ట్ మెంట్ ఇంక పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 06న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభమవగా మే 5 వరకు కొనసాగనున్నది. మీరు డిగ్రీ ఉత్తీర్ణులైతే ఈ గోల్డెన్ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల సంఖ్య:

  • 37

అర్హత:

  • అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/కెమిస్ట్రీ/కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫారెస్ట్రీ/ జియోలజీ/ హార్టికల్చర్/ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ వెటర్నరీ సైన్స్/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2024 నాటికి 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.48,440- రూ.1,37,220 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 15-04-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 05-05-2024.