అందరూ ఊహించినట్లుగానే ఏపీ బీజేపీకి మళ్లీ సినీ గ్లామర్ వచ్చింది. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్నారో లేదో తేలియని జయప్రద, రాజమండ్రి సభలో జాతీయ అధ్యక్షుడు నడ్డా పక్కన కనిపించారు. రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుండే రాజకీయాల్లోకి వెళ్లానంటూ లోకల్ టచ్ ఇచ్చారు. ఇక మీద ఏపీ బీజేపీలో జయప్రద బీజీగా కనిపించొచ్చు. అసలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బీజీ కాబోతున్నానని ఆమె ప్రైవేట్ సంభాషణల్లో చెప్పడంతోనే, అందరూ తెలంగాణ రాజకీయాల్లో జయప్రద అడుగు పెడతారని, వీలైతే […]
ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. ఆయన సీఎంవోలో నియమితులైనప్పటికీ, టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను బదిలీ చేశారు. సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్ ను బదిలీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, […]
విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే తన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ఆ మాటను తు.చ తప్పకుండా వైఎస్ జగన్ పాటిస్తున్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ తాను నిర్థేశించుకున్న విధానాలకు అనుగుణంగా రాజకీయాలు చేశారు. ప్రజా ప్రతినిధి మరణిస్తే.. ఉప ఎన్నికల్లో తన పార్టీకి చెందిన అభ్యర్థిని పోటీలో పెట్టబోనని సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే […]
ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకు ఆధ్యుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని అంటారు. సంక్షేమ పథకాలు, రాజకీయ విమర్శలు, సమస్యలు.. ఇలా ఏదైనా.. తన పార్టీలో ఉన్న ఆయా కులాల నేతలతో మాట్లాడించడం, విమర్శలు చేయించడంతోనే బాబుకు ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఈ విధానాన్ని చంద్రబాబు అవలంభించారని గత రాజకీయాలను పరిశీలిస్తే తెలుస్తుంది. గత ప్రభుత్వ హాయంలో బాబు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని మాజీ […]
ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. మచిలీపట్నం చేపల మార్కెట్లో భాస్కర రావు ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు, రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కర రావును ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. భాస్కర రావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్గా పని చేశారు. పేర్ని నానికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. గడిచిన […]
కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, ఈ రోజు రూ.512 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 […]
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మార్గం సుగమం అవుతోంది. ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపో్యే అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కేసులను ఉపసంహరించుకునే దిశలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో ఒడిశాతో కూడా మాట్లాడేందుకు సన్నద్దమవుతున్న తరుణంలో ప్రాజెక్ట్ కి సంబంధించిన అనుమతుల విషయంలో అన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఏర్పడుతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పటికే దశాబ్దంన్నర కాలంగా […]
ఈ ప్రకృతిలో ఎక్కడో ఉన్న వారికి మరెక్కడో జరిగిన సంఘటనతో సంబంధం ఉంటుందని ఏదో సినిమాలో విన్నట్లు గుర్తు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ఓ ప్రకటనతో ఆ సినిమా డైలాగ్ ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఎవరు ఏమనుకున్నా, ఔనన్నా, కాదన్నా.. కొన్ని విజయాలను, చారిత్రక సంఘటనలను తన ఖాతాలో వేసుకుంటారు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ఆయనకు సాటి మరొకరు లేదు. తాను చేసిన పనులను తానే చెప్పుకోవడానికి సాధారణ ఎమ్మెల్యే […]
మండలిలో ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించి ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కొంతకాలంగా టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పడబోతోంది. త్వరలోనే ఆపార్టీ ఆశలకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవును..అడ్డుకుని తీరుతాం అన్నట్టుగా వ్యవహరించిన విపక్ష టీడీపీ నేతలకు చెక్ పడడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ పార్టీకి మండలిలో 22 మంది సభ్యుల మద్ధతు ఉంది. అదే సమయంలో పాలక వైఎస్సార్సీపీ బలం క్రమంగా పెరగబోతోంది. ఇప్పటికే అధికారికంగా వైఎస్సార్సీపీకి 10 […]