iDreamPost
android-app
ios-app

పవన్‌ని కలిశా.. ఆయన మెంటాలిటీ అలా ఉంటే.. సంచలన విషయాలు బయటపెట్టిన శ్యామల

  • Published May 04, 2024 | 5:30 PM Updated Updated May 04, 2024 | 5:30 PM

యాంకర్ శ్యామల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆమె ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడంతో ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ శ్యామల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆమె ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడంతో ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ని కలిశా.. ఆయన మెంటాలిటీ అలా ఉంటే.. సంచలన విషయాలు బయటపెట్టిన శ్యామల

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి వేసవి తాపం కంటే కూడా ఎక్కువగా ఉంది. నువ్వా నేనా అన్నట్టు అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సినీ రంగానికి చెందిన పలువురు నటులు తమకు నచ్చిన పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. హైపర్ ఆది లాంటి వాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తుంటే.. యాంకర్ శ్యామల వంటి వారు వైసీపీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. యాంకర్ గా, నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. జగన్ ని సీఎం కుర్చీ నుంచి దించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లంతా ఏకమై దాడి చేస్తుంటే.. జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారని.. అలాంటి జగన్ కి అండగా నిలవాల్సిన బాధ్యత మనది అంటూ శ్యామల ముందుకొచ్చారు.

పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు మద్దతుగా ఆమె ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. వంగా గీత గెలుపు ఖాయమైపోయిందని.. ఎవరూ ఆమెను ఓడించలేరని అన్నారు. జగన్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది అంటూ ఆమె అన్నారు. ఈ కూటమి వల్ల ఇవాళ వృద్ధులు, వికలాంగులు పెన్షన్ తీసుకోవడానికి ఎండలో క్యూలో నిలబడుతుంటే కడుపు మండిపోతుందని.. అందుకే ఆ మంటను జగన్ కి ఓటు వేసి గెలిపించుకోవడం ద్వారా చల్లర్చుకోవాలని ఆమె అన్నారు. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గతంలో పవన్ కళ్యాణ్ ని కలిశానని యాంకర్ శ్యామల వెల్లడించారు. అయితే ఇండస్ట్రీకి చెందిన ఒక వర్గం వాళ్ళు తనను పక్కన పెట్టేశారని.. తనకు అవకాశాలు ఇవ్వకుండా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన శ్యామల.. అలాంటి వాళ్ళు ఉంటారా? వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే.. ఇలాంటి ఆలోచనతో ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు అనర్హులు అన్నట్టు శ్యామల మాట్లాడారు. ఇందులో ఉన్నాం కాబట్టి ఆ అమ్మాయిని పిలవద్దు అనే ఒక మెంటాలిటీ గనుక ఆ నాయకులకి ఉంటే, ఆ లీడర్ కి ఉంటే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అవసరమా ఆలోచించండి అని అన్నారు.

ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఈ అమ్మాయిని పిలవద్దు అనే మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఏపీ రాష్ట్రానికి అవసరమా? అలాంటి మెంటాలిటీ ఉంటే జనానికి ఏం చేస్తారు? అంటూ శ్యామల వ్యాఖ్యానించారు. యాంకర్ శ్యామలకి సినిమాల్లో అవకాశాలు పెద్దగా రావడం లేదన్న వాదన అయితే ఉంది. కేవలం వైసీపీ పార్టీకి ప్రచారం చేస్తుందన్న కారణంగా ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదన్న వార్తలు వస్తున్నాయి. దీని గురించే జర్నలిస్ట్ స్వప్న శ్యామల దగ్గర ప్రస్తావించగా ఆమె ఈ విధంగా స్పందించారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన ముసలి తోడేలు, గుంట నక్క కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.