తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పై మరోమారు సీరియస్ అయ్యారు మంత్రి రోజా. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు అంటూ ఆమె ధ్వజమెత్తారు. బోగస్ కంపెనీలతో దోచుకున్న కరప్షన్ కింగ్ అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత అవినీతిలో కూరుకుపోయాడని విమర్శలు గుప్పించారు రోజా. ఆయనపై కక్ష సాధించే అవసరం తమకు లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని పెట్టింది ప్రజల బాగు కోసమని రోజా స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని ఆమె దుయ్యబట్టారు.
చంద్రబాబు తన అధికారాన్ని దోపిడీ కోసమే వినియోగించుకున్నారని మంత్రి రోజా విమర్శించారు. అయితే అధికారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు ఆయన్ను రిమాండ్‌కు పంపిందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరగలేదని, తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని రోజా ప్రశ్నించారు. ఈ కేసులో బాబు లాయర్లు కుంటిసాకుల మీదే వాదించారని ఆమె చెప్పుకొచ్చారు. జీఎస్టీ ఆఫీసర్స్ చంద్రబాబుకు లేఖ రాసిన మాట నిజం కాదా అని క్వశ్చన్ చేశారు. స్కిల్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపింది నిజం కాదా అని ప్రశ్నించారు రోజా. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికితే కొందరు గగ్గోలు పెడుతున్నారని అన్నారు.
వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తూ ఇన్ని రోజులు తప్పించుకున్నారని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు పవన్ తన నోరును అదుపులో పెట్టుకోవాలని.. తప్పు చేసి ఇంకా బుకాయిస్తున్నారని రోజా సీరియస్ అయ్యారు. ‘పవన్ జనసేన పార్టీని పెట్టి.. దాన్ని చంద్రసేనగా మార్చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తికి పవన్ కల్యాణ్ మద్దుతును ఇస్తున్నారు. రాష్ట్ర బంద్‌కు బీజేపీ సపోర్ట్ చేయకున్నా.. పవన్ ఎందుకు మద్దుతునిచ్చారు? పవన్‌కు పొత్తు కోసం బీజేపీ కావాలి. ప్యాకేజీ కోసం తెలుగుదేశం కావాలి. షెల్ కంపెనీల్లో పవన్‌కు కూడా వాటా ఉన్నట్లు ఉంది. ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకొస్తాయి. చట్టం అందరికీ ఒకటే’ అని మంత్రి రోజా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: జైలులో తొలిరోజు చంద్రబాబు లంచ్ ఇదే..!