iDreamPost
android-app
ios-app

ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. బ్రాహ్మణికి ఆర్జీవీ సలహాలు

ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. బ్రాహ్మణికి ఆర్జీవీ సలహాలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై.. 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కాగా, ఆయన అరెస్టు అక్రమమంటూ టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ బంద్ కూడా తుస్సుమనడంతో ఈ సారి చంద్రబాబు కుటుంబలోని మహిళలు రంగ ప్రవేశం చేశారు. చంద్రబాబును అరెస్టును ఖండిస్తూ శనివారం సాయంత్రం రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు సతీమణి, కోడలు, టీడీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా స్పందించారు నారా వారి కోడలు, నందమూరి బాలకృష్ణ తనయ బ్రాహ్మణి. చంద్రబాబు లాంటి 42 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడ్ని అక్రమంగా అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌ను ఆయన మనవడు దేవాన్ష్ చదివినా.. అరెస్టుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెబుతాడని  బ్రాహ్మణి అన్నారు.

కాగా, చంద్రబాబు అరెస్టు అయిన దగ్గర నుండి తనదైన స్టైల్లో విరుచుకు పడుతున్నాడు ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ. వరుస ట్వీట్లతో చంద్రబాబుతో పాటు అటు లోకేశ్, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. తొలుత పవన్ కళ్యాణ్‌కు తొమ్మిది ప్రశ్నలంటూ.. ఆ తర్వాత చంద్రబాబు అవినీతి చేశాడా లేదా అంటూ 12 ప్రశ్నలు సంధించాడు కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేస్తాయని ప్రకటించిన దగ్గర నుండి తన ట్వీట్లకు మరింత పదును పెట్టాడు. గతంలో టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ శ్రేణులపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నాడు. తాజాగా చంద(ద్ర)మామ కథంటూ సీమెన్స్ ఒప్పందం, దానిలో జరిగిన అవినీతి గురించి పూర్తిగా వివరించారు.

తాజాగా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు చేయడంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమోనని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై స్పందించారు ఆర్టీవీ. ‘గౌరవనీయులైన బ్రాహ్మణికి, సిల్క్ స్కాంలో మీకు మీ భర్త లేదా ఇతరులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని భావిస్తున్నాను. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ ఎంట్రీతో గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సువర్ణావకాన్ని వదులుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తాను‘ అని అన్నారు. పార్టీని నడిపించడంతో మీకు సత్తా ఉంది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ‘మీరు రాజకీయాల్లో చేరి బ్రహ్మాస్తంగా మారేందుకు ఇది మంచి అవకాశం. ఓ చెత్త సమయంలో ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చింది. చెత్త వ్యక్తులకు మద్దుతు ఇవ్వడం వల్ల ఆమె ఫేమ్ కోల్పోయింది. మీరు అటువంటి తప్పు చేయవద్దు’ అంటూ మరో సలహాలతో కూడిన ట్వీట్ చేశారు.