iDreamPost
android-app
ios-app

జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు పవన్‌ బిక్కముఖం.. పేర్నినాని కామెంట్లు!

  • Published Oct 09, 2023 | 6:50 PM Updated Updated Oct 09, 2023 | 6:50 PM
  • Published Oct 09, 2023 | 6:50 PMUpdated Oct 09, 2023 | 6:50 PM
జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు పవన్‌ బిక్కముఖం.. పేర్నినాని కామెంట్లు!

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫన్నీ కామెంట్లు చేశారు. ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు పవన్‌ సమాధానం చెప్పలేకపోవటంపై వ్యంగ్యంగా స్పందించారు. కొద్దిరోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌లు మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్‌.. ‘‘ కేంద్ర ప్రభుత్వం నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది కదా.. మీరు పోరాటం చేస్తారా?’’ అని పవన్‌ను అడిగాడు. ఇందుకు పవన్‌ సమాధానం చెప్పలేకపోయారు.

నాదెండ్ల మనోహర్‌కు మైకు ఇచ్చారు. అయితే, ఆయన కూడా దీనికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. పవన్‌, నాదెండ్ల వైఖరిపై తాజాగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది కదా.. మీరు పోరాటం చేస్తారా? కేంద్రం మీద అని ఇప్పుడే అడిగాడు. సాయంత్రం 5.30కి. వెంటనే మనోడికి చుక్కలు కనిపించాయి. అటు, ఇటు చూశాడు. నాదెండ్ల మనోహర్‌ వైపు చూశాడు. ఇది నాకు తెలీదండి మనోహర్‌ గారు మాట్లాడతారు. నేనేమనుకున్నాను.

మనోహర్‌ చించేస్తాడు అనుకున్నా. సమాధానం ఏది. మీ పేపరే అడిగింది. మీ పేపర్‌ అడిగితే సమాధానం ఏది.. ఒకాయన ఊ.. ఆ.. చుక్కలు చూస్తాడు. పైకీ కిందకు చూసి ఈయన మాట్లాడతాడు అంటాడు. మనోహర్‌ ఏం మాట్లాడాలో తెలీక చూస్తాం అంటాడు. వీళ్లిద్దరూ కలిసీ రాష్ట్రాన్ని బాగు చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తీర్చి దిద్దుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి భవిష్యత్తు కల్పిస్తారు. వీళ్లు..’’ అని అన్నారు. మరి, పేర్నినాని.. పవన్‌పై ఫన్నీ కామెంట్లు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom