nagidream
Again YCP Ruling Says Aaraa Mastan Survey: ఏపీ రాజకీయాల్లో ఉన్నంత వాడి, వేడి ఇంకెక్కడా ఉండదు. ఇటీవలే అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ అయ్యాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయినప్పటికీ ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పైనే జనాల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆరా మస్తాన్ సర్వేపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆయన సర్వేలో ఏం తేలింది? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి?
Again YCP Ruling Says Aaraa Mastan Survey: ఏపీ రాజకీయాల్లో ఉన్నంత వాడి, వేడి ఇంకెక్కడా ఉండదు. ఇటీవలే అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ అయ్యాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయినప్పటికీ ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పైనే జనాల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆరా మస్తాన్ సర్వేపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆయన సర్వేలో ఏం తేలింది? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి?
nagidream
ఎన్నికల సందడి మొదలైందంటే చాలు.. అందరి కన్నూ ఎగ్జిట్ పోల్స్ మీదనే ఉంటుంది. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అని ఎదురుచూస్తుంటారు. ఈ ఎదురుచూపులు ఏపీలో బాగా ఎక్కువగా ఉంటాయి. ఏపీ రాజకీయాల్లో ఉన్నంత హీట్ దేశంలో వేరే ఎక్కడా ఉండదు. మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మీదనే తెలుగు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే దాని మీదనే ఎక్కువ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. పలు మీడియా సంస్థలు, ప్రముఖ వ్యక్తులు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెలువరించారు.
ఏపీలో మళ్ళీ వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. వైసీపీ మరోసారి ఘన విజయాన్ని సాధిస్తుందని చెబుతున్నాయి. మెజారిటీ సర్వేలన్నీ కూడా వైసీపీ పార్టీ 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని చెబుతున్నాయి. వైసీపీకి 122, కూటమికి 53 సీట్లు వస్తాయని రేస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలిపింది. వైసీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని.. కూటమికి 55 నుంచి 65 సీట్లు వస్తాయని పార్థ దాస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ సర్వే చెబుతుంది. మరోవైపు ఆరా మస్తాన్ సర్వే కూడా వైసీపీనే మరోసారి అధికారం చేపట్టబోతుందని తెలిపింది.
ఏపీలో ఆరా మస్తాన్ సర్వే అంటే ప్రజలకు విశ్వసనీయత ఉంది. ఆయన చెప్పిన వాటిలో దాదాపు అన్నీ నిజాలే అయ్యాయి. గతంలో తెలంగాణలో దుబ్బాకలో జరిగిన ఎన్నికలప్పుడు కూడా ఆయన చెప్పినట్టే జరిగింది. ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే దాని మీద ఆయన చెప్పినవన్నీ సక్సెస్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఆరా మస్తాన్ సర్వే మీద ఏపీ ప్రజల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఇంత మెజారిటీ ఓట్లతో గెలుస్తుంది అని చెబుతారు. ఆయన చెప్పినట్టుగానే ఆ సంఖ్యకు అటూ, ఇటుగా ఉంటుంది. కానీ దాదాపు ఆరా మస్తాన్ సర్వే అంటే ప్రజల్లో ఒక నమ్మకమైతే ఉంది. తాజాగా ఆయన ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ని వెలువరించారు. ఆరా మస్తాన్ సర్వేలో వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని తేలింది.
వైసీపీ పార్టీకి 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ఆరా మస్తాన్ తన సర్వేలో ప్రకటించారు. 56 శాతం మంది మహిళలు జగన్ ని మరోసారి గెలిపించుకోవడానికి ఓట్లు వేశారని ఆరా మస్తాన్ అన్నారు. కేవలం 42 శాతం మంది మహిళలు మాత్రమే కూటమికి ఓటు వేశారని అన్నారు. 56 శాతం మగవాళ్ళు కూటమికి ఓట్లు వేయగా.. మిగతా 44 శాతం వైసీపీకి ఓటు వేశారని అన్నారు. అయితే ఈసారి మగాళ్లతో పోలిస్తే మహిళలు 1.43 శాతం అధికంగా ఓట్లు వేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వైసీపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయని అన్నారు. ఈ కారణాల దృష్ట్యా వైసీపీ 49.41 శాతం ఓట్లను సాధించి 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగరవేయబోతుందని అన్నారు.
ఇక టీడీపీ కూటమి 47.55 శాతం ఓట్లను సాధించి కేవలం 71 నుంచి 81 స్థానాలకు పరిమితం కానుందని వెల్లడించారు. 20, 25 స్థానాల ఆధిక్యతతో వైసీపీ విజయం సాధిస్తుందని అన్నారు. ఎంపీ స్థానాల విషయానికొస్తే.. 25 పార్లమెంట్ స్థానాల్లో 48.29 శాతం ఓట్లను సాధించి 13 నుంచి 15 పార్లమెంట్ స్థానాలను గెలవబోతుంది. టీడీపీ కూటమి 47.68 ఓట్ల శాతంతో 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలను గెలవబోతుంది. మిగతా స్థానాలను ఇతర పార్టీలు సాధిస్తాయని వెల్లడించారు. ఆరా మస్తాన్ చెప్పింది ఏదీ ఇప్పటి వరకూ ఫెయిల్ అవ్వలేదు. ఈసారి కూడా వైసీపీనే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అన్నమాట. దీంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.