nagidream
Paripoornananda Swami: జూన్ 4 కోసం ఎంతోమంది ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతారు? అనే దానిపై చర్చ ఇంకా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో పరిపూర్ణానంద స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
Paripoornananda Swami: జూన్ 4 కోసం ఎంతోమంది ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతారు? అనే దానిపై చర్చ ఇంకా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో పరిపూర్ణానంద స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
nagidream
జూన్ 4 ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీదే విజయం అని తెలిపాయి. మెజారిటీ సర్వేలు వైసీపీనే గెలుస్తుందని వెల్లడించాయి. ఆరా మస్తాన్ సర్వేలో వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని తేలగా.. టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని తెలిపారు. ఇక చాణక్య పార్థ సర్వేలో వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. టీడీపీ కూటమికి 55 నుంచి 65 స్థానాలు వస్తాయని అన్నారు. ఆత్మసాక్షి సర్వేలో వైసీపీ 98 నుంచి 116 స్థానాలు గెలుచుకుంటుందని.. టీడీపీ కూటమి 59 నుంచి 77 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తేలింది. చాలా వరకూ సర్వేలు వైసీపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తాజాగా కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుందో అనే దానిపై స్పందించారు. 123 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని అన్నారు. ఆరా మస్తాన్ సర్వేకి ప్రజల్లో ఒక విశ్వసనీయత ఉందని.. తనకు కూడా ఆయన సర్వే మీద నమ్మకం ఉందని పరిపూర్ణానంద స్వామి అన్నారు. అయితే మొన్న ప్రెస్ మీట్ లో ఆరా మస్తాన్ టెన్షన్ కి గురయ్యారని.. ఒత్తిడికి లోనై ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించినట్లు అనిపించిందని అన్నారు. ఆయన చెప్పినట్టు వైసీపీ 94 నుంచి 104 సీట్లతో ఆగిపోయే పరిస్థితి కనబడడం లేదని అన్నారు. జగన్ కావాలి అనేటువంటి వర్గానికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయని తనకు సమాచారం అందిందని అన్నారు.
మహిళల ఓట్ల శాతం పెరిగాయని, వీరి ఓట్లే జగన్ కి పడ్డాయని అన్నారు. తనకు తెలిసిన వ్యక్తి చెప్పారని అన్నారు. 123 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు స్పష్టంగా గెలుస్తారని అన్నారు. 2019లో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారని తెలిపారు. గతంలో వచ్చిన 151 స్థానాలకు.. ఇప్పుడు 8 స్థానాలు అదనంగా యాడ్ అవ్వనున్నాయని అన్నారు. అయితే తన పరిశీలన ప్రకారం.. వైసీపీ 123 స్థానాల్లో గెలుస్తుందని అనిపిస్తుందని అన్నారు. ఇక హిందూపురంలో కూడా ఒక పరిణామాన్ని చవి చూస్తామని అనిపిస్తుందని.. వైసీపీ అభ్యర్థి గెలుస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హిందూపురంలో బాలకృష్ణకు తిరుగులేదన్న అభిప్రాయం ఉండేది. అయితే పరిపూర్ణానంద స్వామి చెప్పినట్టు ఇప్పుడు బాలయ్యకు ఓటమి తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి 17 నుంచి 18 ఎంపీ స్థానాలు వస్తాయని అన్నారు.