iDreamPost
android-app
ios-app

పవన్‌లో ఓటమి భయం! పిఠాపురంలో అంత మందితో ప్రచారం అందుకే: యాంకర్

  • Published May 03, 2024 | 6:58 PM Updated Updated May 03, 2024 | 6:58 PM

ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఒంటరి అభ్యర్థి అయిన వంగా గీతకు వ్యతిరేకంగా అంతమందితో ప్రచారం చేయిస్తున్నారని అన్నారు.

ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఒంటరి అభ్యర్థి అయిన వంగా గీతకు వ్యతిరేకంగా అంతమందితో ప్రచారం చేయిస్తున్నారని అన్నారు.

పవన్‌లో ఓటమి భయం! పిఠాపురంలో అంత మందితో ప్రచారం అందుకే: యాంకర్

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎండాకాలం ఎండల హీట్ కంటే కూడా ఎక్కువ హీట్ పుట్టిస్తున్నాయి. ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఒక పక్క ఒంటరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ.. చావో రేవో.. తాడో పేడో తేల్చుకుందాం అంటూ ఎన్నికల రణ రంగంలో కాలు దువ్వుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ వాళ్ళు సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలను తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ హైపర్ ఆది, హీరోయిన్ నమిత వంటి వాళ్ళు కూటమికి మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తున్నారు. పవన్ ని పిఠాపురంలో గెలిపించడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత మంది వచ్చినా పిఠాపురంలో వంగా గీతను ఓడించలేరని యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల కామెంట్స్ చేశారు.

పవన్ లో ఓటమి భయం ఉందని.. నిజంగా ఆయనకు అంత పవర్ ఉంటే ప్రచారానికి హైపర్ ఆది లాంటి వాళ్ళు అంతమంది దేనికంటూ కామెంట్స్ చేశారు. గ్రౌండ్ లెవల్ లో ఉన్న రియాలిటీ ప్రజలకు తెలుసునని.. చెప్పేవాళ్ళు చాలా చెప్పుకుంటున్నారని.. కానీ జరిగేది జరుగుతుందని.. అది మనం చూస్తామని వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వంగా గీత రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే.. ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో అందరికీ తెలుసునని.. చుట్టూ ఉన్న ప్రజల కోసం ఆమెకు చేతనైనంత చేసుకుంటూ వచ్చారని అన్నారు. చిన్న పొజిషన్ నుంచి కూడా చేయగలిగినంత సేవ ఆమె చేశారని అన్నారు. మరి ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ ని కొట్టాలంటే మరి పవన్ కి ఆ మాత్రం సపోర్ట్ అవసరం అని చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే.. జబర్దస్త్ టీమ్ పని చేస్తున్నారంటే రకరకాల ఒత్తిళ్లు, రకరకాల కారణాలు ఉండవచ్చునని అన్నారు. అయితే తాను ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అని.. పిఠాపురంలో వంగా గీత గెలుపు ఆల్రెడీ ఎప్పుడో ఖాయం అయిపోయిందని అన్నారు. తాను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి.. వంగా గీతను కలవడానికి కారణం.. భారీ మెజారిటీతో గెలిపించడం కోసమే అని శ్యామల అన్నారు. ఎందుకంటే గెలిచేది వంగా గీతనే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. కూటమి అన్నారు, మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ అందులో బీజేపీ పెద్దన్న మోదీ ఫోటో లేదని.. మాకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగిందని.. అదే కూటమికి మైనస్ అని శ్యామల కామెంట్స్ చేశారు. ఇవాళ ఒక న్యూస్ పేపర్ చూసుకుంటే.. అందులో కేవలం ఒకరి ఫోటో మాత్రమే ఉందని.. మిగతా ఇద్దరి ఫోటోల్లో కూడా ఒకరి ఫోటో లేదని.. అక్కడ ఇంకో మైనస్ అని అన్నారు.

ఇలా కూటమికి ఒకదాని తర్వాత ఒకటి మైనస్ లవుతూ వస్తున్నాయని.. అవే వైసీపీ పార్టీకి ప్లస్ అవుతున్నాయని అన్నారు. మనం క్లారిటీతో ఉన్నామని.. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పని చేస్తున్న పార్టీ అని.. ఇది మన పార్టీ.. దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు, లొసుగులు అవసరం లేదని.. ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు సంక్షేమం జరగాలి అదే మన ధ్యేయం అని శ్యామల అన్నారు. ఇవాళ కూటమి దయ వల్ల ఇంత మండుటెండలో, ఉక్కబోతలో పాపం వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని.. చూస్తుంటే కడుపు మండిపోతుందని అన్నారు. ఆ మంటనంతా ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగన్ ను సీఎం చేయాలి అంటూ యాంకర్ శ్యామల కామెంట్స్ చేశారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis