iDreamPost
android-app
ios-app

వీడియో: పోలింగ్ బూత్‌లో ఓటు వేసేటప్పుడు తడబడ్డ పవన్..

కొత్తగా ఓటు వేసే వారికి అంటే పోలింగ్ బూత్ లో టెన్షన్, అయోమయం నెలకొంటుంది. ఓటు ఎలా వేయాలో? వేశాక ఎవరికి వేశామో? ఏంటో అన్న కంగారు ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి పోలింగ్ బూత్ లో తడబాటుకు గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కొత్తగా ఓటు వేసే వారికి అంటే పోలింగ్ బూత్ లో టెన్షన్, అయోమయం నెలకొంటుంది. ఓటు ఎలా వేయాలో? వేశాక ఎవరికి వేశామో? ఏంటో అన్న కంగారు ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి పోలింగ్ బూత్ లో తడబాటుకు గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వీడియో: పోలింగ్ బూత్‌లో ఓటు వేసేటప్పుడు తడబడ్డ పవన్..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తెలంగాణలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న క్రమంలో అక్కడ ఎన్నికలు పండుగను తలపించాయి. ఈ క్రమంలో ఆయా పార్టీ అభ్యర్థులు ఉత్సాహంగా పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును స్థానిక పోలింగ్ బూత్ లో వినియోగించుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన తడబాటుకు గురవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాన్యులకు ఉన్న కనీస అవగాహన కూడా లేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్ళాక ఓటర్ ఐడీ, ఓటర్ స్లిప్ ఇస్తే.. ఓటర్ లిస్టులో పేరు, వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో సిబ్బంది చూస్తారు. ఆ తర్వాత చేతికి సిరా పూసి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ని మరొక సిబ్బంది దగ్గరకు వెళ్లి వారికి ఇవ్వాలి. వాళ్ళు స్లిప్ తీసుకున్నాక ఈవీఎం మెషిన్ దగ్గరకు వెళ్లి ఓటు వేయాలి. ఓటు వేశాక ఈవీఎం మెషిన్ పక్కన ఉన్న వీవీప్యాట్ మెషిన్ లో ఎవరికి ఓటు వేశారో అన్నది నిర్ధారించుకోవచ్చు. ఈ విషయం సామాన్యులకు కూడా తెలుసు.

చదువు రాని వారు కూడా ఓటు ఎలా వేయాలో.. వేసిన తర్వాత ఎలా నిర్ధారించుకోవాలో తెలిసి ఉన్నారు. అయితే ఒక పార్టీ అధ్యక్షుడైన పవన్ కి ఓటు వేశాక ప్రింట్ అవుట్ రాదా అని అడగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందరిలానే పవన్ కళ్యాణ్ కూడా పోలింగ్ బూత్ లోపలకు వెళ్లారు. ఈవీఎంలో ఓటు వేశారు. అక్కడే నిలబడి కాసేపు అలానే చూశారు. ఆ తర్వాత ప్రింట్ అవుట్ ఏమీ రాదు కదా అంటూ పోలింగ్ సిబ్బందిని అడిగారు. మానిటర్ లో చూసుకోవచ్చునని సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే ఓటు వేసిన తర్వాత ప్రింట్ అవుట్ రాదా పవన్ కళ్యాణ్ అడగడం ఆయన అవివేకానికి నిదర్శనం అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఓటు గురించి కనీస అవగాహన లేని మీరు ఎలా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అయ్యారు అంటూ వైసీపీ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి